Best Web Hosting Provider In India 2024
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎనిమిదో రోజు మిక్స్‌డ్ రిజల్ట్స్ ఎదురయ్యాయి. షూటింగ్‌లో మను భాకర్ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం మిస్సయింది. ఆర్చరీలో దీపికా కుమారి పతకం గెలిచేలా కనిపించి చివరలో చేతులెత్తేసింది. తొమ్మిదో రోజు మాత్రం భారత్ తప్పకుండా మెడల్ సాధిస్తుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.
ఆదివారం ఒలింపిక్స్ బరిలో స్టార్ అథ్లెట్లు నిలిచారు. బాక్సింగ్‌లో లవ్లీనా, బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ కీలక పోరుకు సిద్ధమయ్యారు.
బ్యాడ్మింటన్…
బ్యాడ్మింటన్‌లో ఇప్పటికే పీవీ సింధుతో పాటు మిగిలిన షటర్లు అందరూ ఓటమి పాలై ఇంటిదారి పట్టారు. కేవలం లక్ష్యసేన్ మాత్రం పతకం ఆశలు నిలబెడుతూ అద్భుత అటతీరుతో అదరగొడుతోన్నాడు.ఆదివారం సెమీఫైనల్‌లో వరల్డ్ నంబర్ వన్ విక్టర్ అక్జెల్సెన్‌తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.
సెమీస్‌లో గెలిస్తే లక్ష్యసేన్‌కు మెడల్ ఖాయమైనట్లే. కానీ బలాబలాల పరంగా చూసుకుంటే లక్ష్యసేన్‌పై అక్జెల్సెన్‌దే డామినేషన్ కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇద్దరు ఎనిమిదిసార్లు తలపడగా ఏడుసార్లు అక్జెల్సెన్ గెలిచాడు. ఒక్కసారి మాత్రమే లక్ష్యసేన్ విజయాన్ని అందుకున్నాడు.
బాక్సింగ్ – లవ్లీనా
బాక్సింగ్‌లో 75 కేజీల క్వార్టర్ ఫైనల్ పోటీల్లో ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ లవ్లీనా బోర్గోహెయిన్‌తో చైనాకు చెందిన లీ క్వియాన్‌తో తలపడనుంది.
హాకీ – ఇండియా వర్సెస్ బ్రిటన్
షూటింగ్
మెన్స్ 25 మీటర్ల రాపిడ్ ఫైర్ (విజయ్ వీర్, అనీష్), స్కీట్ ఉమెన్స్ క్వాలిఫయర్ (మహేశ్వరి చౌహాన్, రైజా థిల్లాన్)
అథ్లెటిక్స్ – ఉమెన్స్ 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ – పారుల్ చౌదరి, మెన్స్ లాంగ్ జంప్ – జస్వీన్ అల్డ్రీన్
సెయిలింగ్ – మెన్స్ డింగీ – విష్ణు శరవణన్
గోల్ఫ్ నాలుగో రౌండ్ _- శుభాంకర్ శర్మ, గగన్ జీత్ భుల్లార్
Best Web Hosting Provider In India 2024
Source link