Best Web Hosting Provider In India 2024

Abids Girl Kidnap : హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. గాంధీ భవన్ కట్టెల మండికి చెందిన 6 ఏళ్ల బాలికను చాక్లెట్ ఆశ చూపి అగంతకుడు ఆటోలో తీసుకెళ్లాడు. కిడ్నాప్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. 8 బృందాలు పాప కోసం గాలింపు మొదలుపెట్టాయి. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 8 పోలీస్ బృందాలుగా ఏర్పడి 300 సీసీటీవీ కెమెరాలు పరిశీలించి గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ ను పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాపర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ బీహార్ కి చెందిన బిలాల్ గా పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగింది?
హైదరాబాద్ నగరంలోని అబిడ్స్‌లో శనివారం సాయంత్రం కట్టెలమండిలో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశచూపి ఓ వ్యక్తి ఆటోలో కిడ్నాప్ చేశాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందు ఐదు బృందాలతో పోలీసులు గాలించారు. అగంతకుడు బాలికను రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనుముల నర్వకు తీసుకెళ్లాడు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసుల…అతడు ఎక్కడికి వెళ్లాడో గుర్తించారు. పోలీసులు నిందితుడిని ఇనుముల నర్వలో అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని అబిడ్స్ పీఎస్ కు తీసుకొచ్చారు. ఆ తర్వాత సైఫాబాద్ భరోసా కేంద్రానికి తరలించారు. కిడ్నాపర్‌ను బిహార్‌కు చెందిన ఎండీ బిలాల్‌గా గుర్తించిన పోలీసులు… నిందితుడిని విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసినట్లు అబిడ్స్ ఏసీపీ స్పష్టం చేశారు. అయితే నిందితుడిని పోలీసులు అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చినప్పుడు…బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు అతడిపై దాడి చేశారు. పోలీసులు అతికష్టంమీద నిందితుడిని స్టేషన్ లోపలికి తరలించారు.
సంబంధిత కథనం
టాపిక్