Postal GDS Recruitment : టెన్త్ అర్హతతో పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలు, దరఖాస్తుకు రేపే చివరి తేదీ

Best Web Hosting Provider In India 2024

Postal GDS Recruitment : దేశవ్యాప్తంగా 44,228 జీడీఎస్(గ్రామీణ్ డాక్ సేవక్) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపడతారు. దరఖాస్తు గడువు రేపటితో(ఆగస్టు 5) ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాంచ్ పోస్టు మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్, డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టును బట్టి రూ.10 వేల నుంచి రూ.12500 వరకు ప్రారంభ వేతనం ఉంటుంది. ఏపీలో 1,355, తెలంగాణలో 981 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు నాలుగు గంటలు మాత్రమే విధులు నిర్వహిస్తే సరిపోతుంది. అయితే పోస్టల్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ చెల్లిస్తారు.

 

అర్హతలు

జీడీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. టెన్త్ లో గణితం, ఇంగ్లిష్‌, లోకల్ లాంగ్వేజ్(ఏపీ, తెలంగాణలో తెలుగు) చదివి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఇస్తారు. బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000 – రూ.29,380, ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు నెలకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ ఉమెన్‌లకు ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి.

ఎంపిక ఇలా?

పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకున్నప్పుడు అభ్యర్థులు ప్రాధాన్యత ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్‌ల మేరకు పోస్టింగ్‌ కేటాయిస్తారు. అర్హత సాధించిన వారికి ఎస్‌ఎంఎస్‌/ ఈమెయిల్‌/ పోస్టు ద్వారా సమాచారం అందిస్తారు.

దరఖాస్తు విధానం

Step 1 : పోస్టల్ అధికారిక వెబ్‌సైట్‌ https://indiapostgdsonline.gov.in/ ను సందర్శించండి.

 

Step 2 : రిజిస్ట్రేషన్, పాస్‌వర్డ్‌ నమోదు చేసుకోవడానికి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అవసరం

Step 3 : ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడానికి ముందు దరఖాస్తు రుసుమును చెల్లించాలి.

Step 4 : మీ డివిజన్, ఆప్షన్లు ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Step 5 : తగిన ఫార్మాట్, పరిమాణం దరఖాస్తు సమర్పించే ముందు ఫొటోగ్రాఫ్ , డిజిటల్ సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.

Step 6 : రిక్రూట్‌మెంట్ తర్వాతి దశలో మీ పత్రాల వెరిఫికేషన్ కోసం డివిజన్, డివిజినల్ హెడ్‌ ను మీరు తప్పక ఎంచుకోవాలి.

 

 

 
WhatsApp channel
 

సంబంధిత కథనం

టాపిక్

 
India PostJobsAp JobsAndhra Pradesh NewsTelangana News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024