Best Web Hosting Provider In India 2024
Hyderabad Cable Bridge Accident : హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన బైక్ డివైడర్ ను ఢీకొని కింద పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కేబుల్ బ్రిడ్జి పైనుంచి పడి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో యువకులు అతివేగంగా బైక్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నల్లమలలో కారు ప్రమాదం
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్రాబాద్ మండలం నల్లమలలో కారు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కారు బలంగా చెట్టును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సున్నిపెంట ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు మృతి
హైదరాబాద్ లోని బొల్లారానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఆదివారం తెల్లవారు జామున నిద్రమత్తులో కారు వేగంగా వెళ్లి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. కారులోని నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ప్రమాదంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తున్నారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది.
సంబంధిత కథనం
టాపిక్