AP TG NEET UG Ranks : ఏపీ, తెలంగాణ నీట్ యూజీ రాష్ట్ర స్థాయి ర్యాంకుల జాబితా విడుదల-కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే

Best Web Hosting Provider In India 2024

AP TG NEET UG Ranks : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీట్-యూజీ 2024 రాష్ట్ర ర్యాంకుల జాబితా విడుదలైంది. జాతీయ ర్యాంకులకు అనుగుణంగా ఏపీ విద్యార్థుల నీట్ ర్యాంకులను డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రాష్ట్ర ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర ర్యాంకుల అనుగుణంగా విద్యార్థులు కౌన్సెలింగ్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు మొదటి వారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 14 నుంచి ఎంబీబీఎస్‌లో అకడమిక్‌ సెషన్‌ ప్రారంభం అవుతుందని అధికారులు ప్రకటించారు. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రకటించిన తేదీల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సెలింగ్‌ను నిర్వహించాల్సి ఉంటుంది.

 

ఏపీలో మొత్తం 720 మార్కులకు జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు 162 మార్కులు కటాఫ్ గా నిర్ణయించారు. ఇక ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 161-127 మార్కులు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ (దివ్యాంగులు) కేటరిగిరీలో 143-127 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. ఏపీ నీట్ ర్యాంకులను డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. మొత్తం 43,788 మందికి ర్యాంకులు ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 720 మార్కులకు జనరల్, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 162 మార్కులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 127 మార్కులు, ఓసీ, ఎస్సీ, ఎస్టీ(పీడబ్ల్యూబీడీ) కేటగిరీల్లో 144 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 49,143 మంది ర్యాంకులను ప్రకటించినట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం 710 మెడికల్ కాలేజీల్లో 1.10 లక్షల ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు.

తొలి రౌండ్ కౌన్సెలింగ్

ఆలిండియా కోటా సీట్లు భర్తీకి మొదటి రౌండ్ కౌన్సెలింగ్ నమోదు ప్రక్రియ ఆగస్ట్ 14న ప్రారంభమై ఆగస్టు 21తో ముగుస్తుంది. ఆగస్టు 16న ఛాయిస్ ఫిల్లింగ్ లాకింగ్ కు అవకాశం కల్పిస్తారు. ఇది ఆగస్టు 20న ముగుస్తుంది. సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆగస్టు 21, 22 తేదీల్లో జరుగుతుంది. నీట్ యూజీ తొలి రౌండ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలు ఆగస్టు 23న ప్రకటిస్తారు. అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి ఆగస్టు 29 వరకు కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయవచ్చు.

 

సెకండ్ రౌండ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు :

  • రిజిస్ట్రేషన్‌ తేదీలు -సెప్టెంబరు 5 నుంచి 10 వరకు
  • సీట్ల కేటాయింపు – సెప్టెంబరు 11, 12
  • సీట్ల కేటాయింపు ఫలితాలు -సెప్టెంబర్ 13
  • కాలేజీల్లో రిపోర్టు చేయాల్సిన తేదీలు – సెప్టెంబర్‌ 14 నుంచి 20 వరకు

మూడో రౌండ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు

  • రిజిస్ట్రేషన్‌ తేదీలు: సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 2 వరకు
  • సీట్ల కేటాయింపు – అక్టోబరు 3 నుంచి 4 వరకు
  • సీట్ల కేటాయింపు ఫలితాలు – అక్టోబర్ 5
  • కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సిన తేదీలు – అక్టోబర్‌ 6 నుంచి 12 వరకు

NEET UG కౌన్సెలింగ్ 2024: ఎలా నమోదు చేసుకోవాలి

Step 1 : అధికారిక వెబ్ సైట్ https://mcc.nic.in/ ను సందర్శించండి.

Step 2 : హోమ్ పేజీలో MCC NEET UG కౌన్సెలింగ్ 2024 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3 : రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి.

Step 4 : అభ్యర్థి అకౌంట్ లాగిన్ చేయండి.

Step 5 : దరఖాస్తు ఫామ్‌ను నింపి, రుసుము చెల్లించండి.

Step 6 : సబ్మిట్ క్లిక్ చేసి, పేజీని డౌన్‌లోడ్ చేయండి.

 

Step 7 : తదుపరి అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి.

 

 
WhatsApp channel
 

సంబంధిత కథనం

టాపిక్

 
 
EducationAndhra Pradesh NewsTelangana NewsNeetTelugu NewsAdmissions
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024