Double Ismart Trailer: బ్రెయిన్ మెమొరీ ట్రాన్స్‌ఫర్.. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ వచ్చేసింది.. మాస్ జాతరే!

Best Web Hosting Provider In India 2024

ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంపై హైప్ బాగానే ఉంది. ఈ ఊర మాస్ యాక్షన్ మూవీకి స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. సూపర్ హిట్ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‍గా ఈ సినిమా వస్తోంది. డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ సినిమా ట్రైలర్‌ను మూవీ టీమ్ నేడు (ఆగస్టు 4) రిలీజ్ చేసింది.

 

డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఊహించిన విధంగానే మాస్ యాక్షన్‍తో, నాటు డైలాగ్‍లతో ఉంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‍గా బిగ్‍బుల్ పాత్రను ఈ చిత్రంలో చేశారు. బిగ్‍బుల్ బ్రెయిన్‍లోని మెమొరీని శంకర్ (రామ్ పోతినేని) మెదడులో పంపించడం ఈ ట్రైలర్‌లో ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. తన మార్క్ ఎనర్జిటిక్ యాక్షన్, మాస్ డైలాగ్‍లు, డ్యాన్స్‌తో రామ్ దుమ్మురేపారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చిప్‍ను తలలో పెడితే.. ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీలో ఏకంగా బ్రెయిన్ మెమొరీ ట్రాన్స్‌ఫర్ కాన్సెప్ట్ తీసుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్.

ట్రైలర్ ఇలా..

రామ్ పోతినేని స్టైలిష్ ఎంట్రీతో డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ షురూ అయింది. తలకు యూఎస్‍బీ పోర్ట్ పెట్టుకొని తిరుగుతున్న ఒకే ఒక్క ఇడియట్ అని బ్యాక్‍గ్రౌండ్ వాయిస్ వస్తే.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అంటూ తన మార్క్ డైలాగ్ చెప్పారు రామ్. ‘వాడే మన టార్గెట్’ అని సంజయ్ దత్ అంటారు. అనంతరం రామ్ యాక్షన్ సీన్ ఉంది. కావ్య థాపర్‌తో లవ్, డబుల్ మీనింగ్ డైలాగ్‍లు కూడా ఉన్నాయి.

తాను మరణం లేకుండా ఉండాలని బిగ్‍బుల్ (సంజయ్ దత్) అనుకుంటాడు. దానికి మెమొరీ ట్రాన్స్‌ఫరే మార్గమని సైంటిస్ట్ చెబుతాడు. దీంతో శంకర్ (రామ్) మెదడులోకి తన జ్ఞాపకాలను పంపేందుకు మిషన్ చేస్తాడు బిగ్‍బుల్. ఇది వర్కింగ్ అని కూడా అంటాడు. ఈ ట్రైలర్ చివర్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. రామ్, సంజయ్ దత్ తలపడతారు. ఇద్దరూ తానే బిగ్‍బుల్ అంటూ వాదించుకుంటారు. ఇది ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ఆ మధ్యలో కావ్య థాపర్‌తో రామ్ రొమాన్స్ కూడా ఉంది. మొత్తంగా ఈ ట్రైలర్ మాస్‍గా.. ఇంట్రెస్టింగ్‍గా ఉంది. పూరి జగన్నాథ్ మార్క్ స్పష్టంగా కనిపించింది. సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ.. మరోసారి మాస్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍తో మెప్పించారు. 

 

WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024