Paris Olympics Day 4 Schedule: మనూ బాకర్ చరిత్ర సృష్టిస్తుందా? నాలుగో రోజు ఆమె మెడల్ ఈవెంట్ టైమ్ ఇదే.. పూర్తి షెడ్యూల్

Best Web Hosting Provider In India 2024


paris olympics day 4 schedule: పారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటికే ఓ మెడల్ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా షూటర్ గా నిలిచిన మను బాకర్.. ఇప్పుడు ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయురాలిగా నిలవడానికి అడుగు దూరంలో ఉంది. నాలుగో రోజు ఆమె మరో బ్రాంజ్ మెడల్ పోటీలో తలపడనుంది.

 

సాత్విక్, చిరాగ్ జోడీ క్వార్టర్స్‌లో..

అటు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ పారిస్ ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. ప్రపంచ మూడో ర్యాంకర్ జోడీ జర్మనీకి చెందిన మార్క్ లామ్స్‌ఫస్, మార్విన్ సీడెల్ తో తలపడాల్సి ఉంది. అయితే, లామ్స్‌ఫస్ కు గాయం కారణంగా వైదొలగడంతో మ్యాచ్ రద్దయింది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరిన తొలి భారత జోడీ వీరే కావడం విశేషం.

 

షూటర్ మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో సరబ్‌జోత్ సింగ్ తో కలిసి బ్రాంజ్ మెడల్ కోసం పోటీ పడనుంది. సోమవారం (జులై 29) జరిగిన ఫైనల్లో మన టీమ్ మూడో స్థానంలో నిలిచింది. అయితే నాలుగో స్థానంలో ఉన్న కొరియాతో బ్రాంజ్ మెడల్ కోసం మంగళవారం (జులై 30) పోటీ పడాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్ మధ్యాహ్నం 1 గంటకు జరగనుంది. ఇందులోనూ మను మెడల్ గెలిస్తే.. ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా చరిత్ర సృష్టిస్తుంది.

 

షట్లర్లు అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో పారిస్ గేమ్స్ లో తమ తొలి విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐర్లాండ్ తో జరిగే పురుషుల పూల్ బి మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ సింగ్ భారత్ కు నాయకత్వం వహించనుంది. పారిస్ గేమ్స్ నాలుగో రోజు ఆటలో అంకితా భకత్, భజన్ కౌర్, ధీరజ్ బొమ్మదేవర ఆర్చర్లు బరిలోకి దిగుతున్నారు. ప్యాట్రిక్ చిన్యెంబాతో అమిత్ పంగల్ బౌట్ అనంతరం బాక్సర్లు జైస్మిన్ లాంబోరియా, ప్రీతి పవార్ ప్యారిస్ లో భారత్ కు పంచ్ లు వేయనున్నారు.

 

పారిస్ ఒలింపిక్స్ లో నాలుగో రోజు భారత షెడ్యూల్

షూటింగ్

ట్రాప్ పురుషుల క్వాలిఫికేషన్: పృథ్వీరాజ్ తొండైమాన్ – మధ్యాహ్నం 12:30

 

ట్రాప్ మహిళల క్వాలిఫికేషన్: శ్రేయాసి సింగ్, రాజేశ్వరి కుమారి – మధ్యాహ్నం 12:30 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్: భారత్ (మను బాకర్, సరబ్ జ్యోత్ సింగ్) వర్సెస్ కొరియా – మధ్యాహ్నం 1 గంటలకు..

 

రోయింగ్

పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్: బాల్ రాజ్ పన్వార్

 

మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: అంకితా భకత్ (సాయంత్రం 5:15), భజన్ కౌర్ (సాయంత్రం 5:30)

 

పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: ధీరజ్ బొమ్మదేవర (రాత్రి 10:45)

 

బ్యాడ్మింటన్

పురుషుల డబుల్స్ (గ్రూప్ స్టేజ్): సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ అల్ఫియాన్ ఫజార్, మహ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండోనేషియా)

 

పురుషుల 51 కేజీల రౌండ్ ఆఫ్ 16: అమిత్ పంగల్ వర్సెస్ పాట్రిక్ చిన్యెంబా (జాంబియా) – సాయంత్రం 7:15 గంటలకు

 

మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 32 : జైస్మిన్ లాంబోరియా వర్సెస్ నెస్తీ పెటెసియో (ఫిలిప్పీన్స్) – రాత్రి 9:25 గంటలకు

 

మహిళల 54 కేజీల రౌండ్ ఆఫ్ 16: ప్రీతి పవార్ వర్సెస్ యెని మార్సెలా అరియాస్ (కొలంబియా) – అర్ధరాత్రి 1:20 (జూలై 3)

 

 

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source link