Olympics Day 2 India Schedule: ఒలింపిక్స్‌లో రెండో రోజు పీవీ సింధు, నిఖ‌త్ జ‌రీన్ మ్యాచ్‌లు హైలైట్

Best Web Hosting Provider In India 2024


Olympics Day 2 India Schedule: పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా మొద‌టి రోజు ప‌త‌కం గెల‌వ‌లేక‌పోయినా ఫ‌లితాలు మాత్రం సానుకూలంగా వ‌చ్చాయి. హాకీ టీమ్ విజ‌యంతో ఒలింపిక్స్ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 3-2 తేడాతో చిత్తు చేసింది. మ‌రో వైపు షూటింగ్‌లో ప‌ది మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో మ‌ను బాక‌ర్ ఫైన‌ల్‌లో అడుగుపెట్టి ప‌త‌కం ఆశ‌ల‌ను నిల‌బెట్టింది. మిగిలిన షూట‌ర్లు మాత్రం దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. బ్యాడ్మింట‌న్‌లో ఉమెన్స్ డ‌బుల్స్ జోడీ కూడా నిరాశ ప‌రిచింది.

 

మెడ‌ల్ ఈవెంట్స్‌…

రెండో రోజు టీమిండియా ప‌త‌కాల బోణీ కొట్టేలా క‌నిపిస్తోంది. రెండో రోజు కీల‌క‌మైన బ్యాడ్మింట‌న్‌, ఆర్చ‌రీతో పాటు ప‌లు ఈవెంట్స్‌లో ఇండియా పోటీప‌డుతోంది. కొన్ని మెడ‌ల్ ఈవెంట్స్ జ‌రుగ‌నున్నాయి.

 

మ‌ను బాక‌ర్ మెడ‌ల్ గెలుస్తుందా?

10 మీట‌ర్ల ఎయిర్‌ పిస్ట‌ల్ విభాగంలో ఫైన‌ల్ పోటీలు ఆదివారం జ‌రుగ‌నున్నాయి. క్వాలిఫికేష‌న్ రౌండ్‌లో మూడో స్థానంలో నిలిచి స‌త్తా చాటిన మ‌ను బాక‌ర్ ఫైన‌ల్‌లో అదే జోరు కొన‌సాగిస్తే ఇండియా మెడ‌ల్ గెల‌వ‌డం గ్యారెంటీ. మ‌ను బాక‌ర్‌తో పాటు ఆదివారం షూటింగ్‌లో ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేష‌న్ పోటీలు జ‌రుగ‌నున్నాయి. వ‌ల‌రివాన్ -ర‌మితా జిందాల్, సందీప్ సింగ్ – అర్జున్ బ‌రిలో దిగ‌బోతున్నారు.

 

పీవీ సింధు…

బ్యాడ్మింట‌న్‌ లో డ‌బుల్ ఒలింపిక్ విన్న‌ర్ పీవీ సింధు మ్యాచ్ నేడు హైలైట్‌గా నిల‌వ‌నుంది. తొలి రౌండ్‌లో మాల్ధీవులుకు చెందిన అబ్దుల్ ర‌జాక్‌తో పీవీ సింధు త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ ఏక‌ప‌క్షంగానే ముగిసేలా క‌నిపిస్తోంది. రికార్డుల ప‌రంగా అబ్దుల్ ర‌జాక్‌పై సింధుదే అధిప‌త్యం క‌నిపిస్తోంది. మెన్స్ సింగిల్స్‌లో ప్ర‌ణ‌య్ జ‌ర్మ‌నీకి చెందిన ఫాబియ‌న్‌తో పోటీప‌డ‌నున్నాడు.

 

బాక్సింగ్

యాభై కేజీల విభాగంలో నిఖ‌త్ జ‌రీన్ జ‌ర్మ‌నీకి చెందిన మాక్సీ క‌రీనాతో త‌ల‌ప‌డ‌నుంది. తొలి రౌండ్‌లోనే తెలంగాణ బాక్స‌ర్‌ నిఖ‌త్‌కు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి ఎదురైంది.

 

ఆర్చ‌రీ – ఉమెన్స్ టీమ్ క్వార్ట‌ర్ ఫైన‌ల్ పోటీలు (దీపికా కుమారి, అంకిత‌, భ‌జ‌న్ కౌర్), ఉమెన్స్ టీమ్ సెమీ ఫైన‌ల్స్‌, ఉమెన్స్ టీమ్ రిక‌ర్వ్ బ్రాంజ్ మెడ‌ల్ మ్యాచ్‌

 

టెన్నిస్: మెన్స్ సింగిల్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన మౌటెట్‌తో సుమిత్ న‌గాల్ మ్యాచ్ ఆదివారం జ‌రుగ‌నుంది. డ‌బుల్స్‌లో ఫ్రాన్స్ జోడీతోనే రోహిత్ బోప‌న్న – శ్రీరామ్ బాలాజీ త‌ల‌ప‌డ‌నున్నారు.

 

స్విమ్మింగ్‌

100 మీట‌ర్స్ బ్యాక్ స్ట్రోక్ – శ్రీహ‌రి న‌ట‌రాజ్‌

 

200 మీట‌ర్స్ ఫ్రీ స్టైల్ – ధినిధి దేశింగు

 

టేబుల్ టెన్నిస్: మ‌నికా బ‌త్రా, శ్రీజ ఆకుల తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆదివారం జ‌రుగ‌నున్నాయి. రోయింగ్ సింగిల్స్ స్క‌ల్స్‌లో భ‌జ‌రంగ్ త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకోనున్నాడు.

 

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source link