Nuzvid Crime : నూజివీడులో ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, ప్రాణాపాయ స్థితిలో బాలిక!

Best Web Hosting Provider In India 2024

Nuzvid Crime : కృష్ణా జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి దుండ‌గులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై మంత్రి పార్థసారిథి సీరియ‌స్ అయ్యారు. పోలీసులు కేసు న‌మోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘ‌ట‌న కృష్ణా జిల్లా నూజివీడు మండ‌లంలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. సోమ‌వారం తెల్లవారు జామున నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన‌ దుండ‌గులు అక్కడి నుంచి ప‌రార‌య్యారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం అయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని కాపాడుకునేందుకు త‌ల్లిదండ్రులు ప్రయ‌త్నిస్తున్నారు.

నూజివీడు మండ‌లంలోని ఒక గ్రామంలో ఆదివారం రాత్రి త‌ల్లిదండ్రులతో పాటు ఐదేళ్ల చిన్నారి ప‌డుకుంది. సోమ‌వారం తెల్లవారు జామున రెండు గంట‌ల‌కు సమయంలో చిన్నారి గాఢ నిద్రలో ఉండగా…అయితే గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఎత్తికెళ్లిపోయారు. చిన్నారిని స‌మీపంలోని పామాయిల్ తోట‌లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆ చిన్నారిపై దారుణంగా లైంగిక దాడి చేశారు. ఆ త‌రువాత‌ చిన్నారిని అక్కడే ప‌డేసి ప‌రార‌య్యారు. అయితే తెల్లవారు జామునే లేచిన త‌ల్లిదండ్రులు త‌మ ప‌క్కన కుమార్తె లేకపోవడాన్ని గ‌మ‌నించారు. వెంట‌నే చుట్టుప‌క్కల వెతికి చూశారు. కానీ క‌నిపించ‌లేదు. దీంతో కుటుంబ స‌భ్యులు, బంధువులు స‌మీప ప్రాంతంలో వెతికారు.

ఇంటికి స‌మీపంలోని పామాయిల్ తోట‌లో పడిఉన్న బాలిక‌ను గుర్తించారు. అప్పటికే బాలిక ప్రాణాపాయ‌స్థితిలో ఉంది. చిన్నారిని కుటుంబ స‌భ్యులు, వెంట‌నే నూజివీడు ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ప‌రీక్షలు చేసి ఆ చిన్నారిపై లైంగిక దాడి జ‌రిగిన‌ట్లు నిర్ధారించారు. అయితే ఆ చిన్నారి ప‌రిస్థితి విష‌మించ‌డంతో, నూజివీడులో ప్రాథ‌మిక చికిత్స చేసిన త‌రువాత విజ‌య‌వాడ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై చిన్నారి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, గుర్తు తెలియ‌ని దుండ‌గులపై పోక్సో కేసు న‌మోదు చేశారు. వెంట‌నే నిందితుల గురించి గాలింపు చ‌ర్యలు ప్రారంభించారు. ఈ ఘటనతో చిన్నారి త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరు విలపిస్తున్నారు.

అయితే ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర గృహ నిర్మాణ, స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థసార‌థి సీరియ‌స్ అయ్యారు. చిన్నారిపై అత్యాచార ఘ‌ట‌న‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. నిందితుల‌ను త్వర‌గా ప‌ట్టుకోవాల‌ని, అందుకు పోలీసులు జాగిలాలను రంగంలోకి దింపాల‌ని ఆదేశించారు. మంత్రి ఆదేశాల‌తో పోలీసులు నిందితుల కోసం గాలింపు చ‌ర్యలు తీవ్రత‌రం చేశారు.

జ‌గ‌దీశ్వరరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Krishna NewsCrime ApAndhra Pradesh NewsTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024