Vikram Thangalaan: పవన్ ఓ చరిత్ర సృష్టించాడు.. అతనిలాగే నాకూ కావాలని ఉంది: విక్రమ్ కామెంట్స్ వైరల్

Best Web Hosting Provider In India 2024

Vikram Thangalaan: పవన్ కల్యాణ్ ఓ చరిత్రనే సృష్టించాడని అన్నాడు చియాన్ విక్రమ్. పదేళ్లు కష్టపడి ఇప్పుడిలా డిప్యూటీ సీఎం కావడం మామూలు విషయం కాదని అతడు అన్నాడు. తన నెక్ట్స్ మూవీ తంగలాన్ ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత సోమవారం (ఆగస్ట్ 5) విక్రమ్ హైదరాబాద్ లో తెలుగు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా మూవీతోపాటు పవన్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

పవన్‌లాగే నాకూ కావాలని ఉంది: విక్రమ్

తంగలాన్ మూవీ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ను పవన్ కల్యాణ్ సాధించిన ఘనత గురించి మీడియా ప్రశ్నించింది. దీనిపై అతడు స్పందించాడు. తంగలాన్ గురించే మాట్లాడదామని అనుకున్నా.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఉండలేకపోతున్నానని విక్రమ్ అనడం గమనార్హం.

“అతడు ఓ చరిత్రనే సృష్టించాడు. పవన్ నటన నాకు చాలా ఇష్టం. వాటి గురించి ఎంతైనా చెప్పగలను. అయితే వచ్చి పదేళ్లు అవుతోంది. ఎన్నో కష్టాలు పడ్డాడు. మొదట్లో సక్సెస్ కాలేదు. కానీ తర్వాత డిప్యూటీ సీఎం కావడం మామూలు విషయం కాదు. నాకూ అలా చేయాలని ఉంది. నేనూ చేయగలను అని అనిపించింది. కానీ చేయను (నవ్వుతూ) థ్యాంక్యూ” అని విక్రమ్ అన్నాడు.

తంగలాన్ ముందు ఆ సినిమా నథింగ్

ఇక పా రంజిత్ డైరెక్షన్లో తాను చేసిన తంగలాన్ మూవీ గురించి కూడా విక్రమ్ మాట్లాడాడు. ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కానుండగా.. మూవీ టీమ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. కేజీఎఫ్ అసలు కథను వెలికి తీసి చెబుతున్నామని ఈ సినిమా గురించి మేకర్స్ గొప్పగా చెబుతున్నారు. ఆదివారం (ఆగస్ట్ 4) హైదరాబాద్ లోనే ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

 

సోమవారం (ఆగస్ట్ 5) విక్రమ్ మీడియాతో మాట్లాడుతూ.. పా రంజిత్ డైరెక్ట్ చేసిన సర్పట్టా మూవీ ఎంతో బాగుంటుందని, అయితే ఈ తంగలాన్ తో పోలిస్తే ఆ సినిమా నథింగ్ అని అనడం గమనార్హం. “మీరు సర్పట్టా పరంపర మూవీ చూసే ఉంటారు కదా? ఇండియన్ సినిమాలో బాక్సింగ్ అంత ఫేమస్ కాకపోయినా.. పా రంజిత్ మాత్రం మనందరినీ సర్పట్టా ప్రపంచంలోకి తీసుకెళ్లాడు.

ఆ సినిమాలో మనల్ని పూర్తి ఇన్వాల్వ్ చేశాడు. అందరూ సినిమాను ఎంజాయ్ చేశారు. తంగలాన్ కూడా అలాంటిదే. నాకు సర్పట్టా పరంపర మూవీ బాగా నచ్చింది. కానీ మేకింగ్, విజన్ చూస్తే ఈ తంగలాన్ తో పోలిస్తే అది నథింగ్. నేను మరీ ఎక్కువ చేసి ఏమీ చెప్పడం లేదు. మీరు సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. పా రంజిత్ చాలా అద్భుతంగా చేశాడు. సినిమా మేకింగ్ సందర్భంగా మేము అసలు సెల్ ఫోన్స్ వాడలేదు” అని విక్రమ్ చెప్పడం విశేషం.

WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024