AP TET Applications: ముగిసిన ఏపీ టెట్ దరఖాస్తుల స్వీకరణ, షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ

Best Web Hosting Provider In India 2024

AP TET Applications: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించే క్రమంలో దానికి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల మూడవ తేదీతో ముగిసింది. ఈ టెట్ పరీక్షలకు అధిక సంఖ్యలో 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

 

సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో పేపర్ 1-ఎ కు 1,82,609 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్ ప్రత్యేక విద్య పేపర్ 1- బి కు 2,662 మంది దరఖాస్తు చేసుకున్నారు.

స్కూల్ అసిస్టెంట్ టీచర్ విభాగంలో పేపర్ 2- ఏ లాంగ్వేజెస్ కు 64,036 మంది, మాథ్స్ అండ్ సైన్స్ కు 1,04,788 మంది దరఖాస్తు చేసుకోగా సోషల్ స్టడీస్ లో 70,767 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ ప్రత్యేక విద్య పేపర్ 2- బి విభాగంలో 2438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టెట్ పరీక్షలు నిర్వహిస్తామని అభ్యర్ధులందరూ పరీక్షలకు సన్నద్ధం కావాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు.

ఏపీ టెట్ ముఖ్య తేదీలు

  • ఏపీ టెట్ పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ -ఆగస్టు 3, 2024.
  • ఆన్‌లైన్‌ అప్లికేషన్లు చివరి తేదీ – ఆగస్టు 3, 2024.
  • ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌లు – సెప్టెంబర్‌ 19 నుంచి
  • టెట్ హాల్‌ టికెట్లు – సెప్టెంబర్ 22 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అక్టోబర్‌ 3 నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం
  • అక్టోబరు 20వ తేదీతో పరీక్షలు పూర్తి.
  • ఫైనల్ కీ విడుదల – అక్టోబర్‌ 27.
  • టెట్ ఫలితాలు విడుదల – నవంబర్‌ 2, 2024.
  • అధికారిక వెబ్ సైట్ – https://aptet.apcfss.in/

ఏపీ టెట్ 2024 జులై 2 విడుదలైన టెట్ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా, విద్యార్ధుల విజ్ఞప్తి నేపథ్యంలో ఈ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఏపీ టెట్ దరఖాస్తులకు ఆగస్టు 3వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.

 
WhatsApp channel
 

టాపిక్

 
 
Ap TetEducationEntrance TestsGovernment Of Andhra PradeshTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024