Pawan On APTG Issue: క్యాబ్‌ డ్రైవర్లను అడ్డుకోవడంపై తెలంగాణ సర్కారుకు పవన్ కళ్యాణ్‌ విజ్ఞప్తి

Best Web Hosting Provider In India 2024

Pawan On APTG Issue: ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో హైదరాబాద్‌లోs తిరుగుతున్న ఏపీ రిజిస్ట్రేషన్‌ వాహనాలను, క్యాబ్‌లను అడ్డుకోవడంపై పలువురు డ్రైవర్లు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కు వినతి పత్రం సమర్పించారు. డ్రైవర్ల సమస్యలు విన్న పవన్ తెలంగాణ ప్రభుత్వం మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని కోరారు.

జూన్‌2తో ఉమ్మడి రాజధాని గడువు తీరిపోవడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలపై అక్కడి రవాణా శాఖ అధికారులు, తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు అడ్డుకుంటున్నారు. వాహనాలపై జరిమానాలు విధిస్తున్నారు. ఏపీ వాహనాలను స్థానిక డ్రైవర్లు అడ్డుకుంటున్నారు.

ఆల్ ఇండియా పర్మిట్ తో, తెలంగాణ టెంపరరీ పర్మిట్ కట్టుకొని క్యాబ్స్ నడుపుతున్న ఆంధ్ర ప్రదేశ్ డ్రైవర్లను హైదరాబాద్ లో అక్కడి డ్రైవర్లు అడ్డుకొంటున్నారని, ఫలితంగా 2 వేల కుటుంబాలు రోడ్డునపడుతున్నాయని ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం మంత్రి నారా లోకేష్‌కు సైతం డ్రైవర్లు వినతి పత్రాలు సమర్పించారు.

జూన్ 2వ తేదీ నుంచి ఉమ్మడి రాష్ట్ర పరిధి అయిపోయిందని చెబుతూ ఇబ్బంది పెడుతున్నారని మంగళవారం పవన్‌ కళ్యాణ్‌కు వినతి పత్రం ఇచ్చారు. డ్రైవర్ల సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ “ఉమ్మడి రాజధాని గడువు కాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లు హైదరాబాద్ లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదన్నారు.

2 వేల కుటుంబాల వేదన దీనిలో దాగుందని కార్మికులు కలసికట్టుగా ఉండాలన్నారు. తెలంగాణ డ్రైవర్లుకు విన్నపం చేస్తున్నానని, ఇక్కడ రాజధాని పనులు మొదలైతే ఏపీ డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుందన్నారు. అప్పటి వరకూ సాటి డ్రైవర్లపై మానవత థృక్పధంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటామని డ్రైవర్లకు హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలు తగు విధంగా సహకారం అందించుకోవాల్సిన అవసరం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సఖ్యతే మనల్ని ప్రగతిలో ముందుకు నడిపిస్తుందన్నారు.దు

ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి నిత్యం అర్జీలతో రాష్ట్రం నలుమూలల నుంచీ ప్రజలు వస్తున్నారు. మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు కార్యాలయం వద్ద ఉన్న అర్జీదారుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. వారు తెలిపిన సమస్యలు సాంతం విన్నారు.

మదనపల్లెకు చెందిన ఎం.ఆర్.లహరి అనే విద్యార్థిని ఉన్నత విద్యకు అమెరికా వెళ్ళేందుకు కన్సల్టెన్సీని సంప్రదించింది. కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తామని చెప్పి తమ నుంచి రూ.30 లక్షలు కన్సల్టెన్సీ నిర్వాహకుడు వెంకట రెడ్డి వసూలు చేశారనీ, తీరా చూస్తే ఆ పేరుతో యూనివర్సిటీ లేదని, మోసపోయామని, లహరి, ఆమె తల్లి శ్రీమతి లక్ష్మి వాపోయారు. ఇందుకు సంబంధించి వివరాలు నమోదు చేసుకొని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని తన కార్యాలయ అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.

అమెరికాలో ఉన్న విశ్వ విద్యాలయాలు, కాలేజీలకు సంబంధించిన సమాచారం, ఉన్నత విద్యకు వెళ్ళేందుకు అవసరమైన గైడెన్స్ రాష్ట్ర విద్యార్థులకు అందించేలా చూడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని నిర్ణయించారు.

చిత్తూరు జిల్లాకు చెందిన రిషిత అనే బాలిక నరాల బలహీనతతో బాధపడుతోంది. తమ బిడ్డకు వైద్యం అందించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తల్లిదండ్రులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వివరాలు తీసుకొని మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య నిపుణులతో, సంబంధిత శాఖతో మాట్లాడాలని కార్యాలయ అధికారులకు సూచించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ తమ సమస్యలు వివరిస్తూ వినతి పత్రం అందించారు.

WhatsApp channel

టాపిక్

JanasenaPawan KalyanAndhra Pradesh NewsGovernment Of Andhra Pradesh
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024