IITH Admissions: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా అడ్మిషన్ నోటిఫికేషన్‌

Best Web Hosting Provider In India 2024

IITH Admissions:హైదరాబాద్‌ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులకు అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో నిర్వహిస్తున్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులకు అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడింది.

ఐఐటిహెచ్‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో 60సీట్లను భర్తీ చేసక్తారు. మూడేళ్ల కాల వ్యవధిలో చేనేత, టెక్స్‌టైల్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.

దరఖాస్తుదారులు పదో తరగతి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 2024 జులై 1వ తేదీ నాటికి బీసీ, ఓసీ అభ్యర్థులు గరిష్టంగా 23ఏళ్లలోపు వయోపరిమితి కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు చేయడం ఇలా…

ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2024-25 విద్యా సంవత్సరంలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులను https://tsht.telangana.gov.in/HNDM/Views/Home.aspx ద్వారా పొందాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను కమిషనర్,చేనేత జౌళి శాఖ, చేనేత భవనం, 3వ అంతస్తులో సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 90300 79242 హిమజా కుమార్‌ను సంప్రదించాలని చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యార్ సూచించారు.

WhatsApp channel

టాపిక్

AdmissionsEducationAndhra Pradesh NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024