Best Web Hosting Provider In India 2024
Paris Olympics day 12 India Schedule: పారిస్ ఒలింపిక్స్ మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ స్వర్ణ పతక పోరులో సారా హిల్డెబ్రాండ్ తో తలపడనుంది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో వినేశ్ 5-0తో యుస్నేలిస్ గుజ్మన్ లోపెజ్ (క్యూబా)పై ఘన విజయం సాధించింది. పారిస్ లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 పోరులో యుయి సుసాకిపై అద్భుత విజయం ఆమె ఆత్మస్థైర్యాన్ని పెంచింది.
బరిలో వినేశ్, మీరాబాయి
పారిస్ ఒలింపిక్స్ 12వ రోజు భారత్ కు ఎంతో కీలకం కానుంది. కెరీర్లో తొలిసారి వినేశ్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కోసం తలపడబోతోంది. ఇందులో గెలిస్తే మాత్రం ఆమె సరికొత్త చరిత్ర సృష్టించినట్లే. ఇప్పటి వరకూ రెజ్లింగ్ లో గోల్డ్ మెడల్ ఎప్పుడూ రాలేదు.
వినేశ్ తో పాటు మరో ప్రముఖ భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్ బుధవారం (ఆగస్ట్ 7) ప్రీక్వార్టర్ ఫైనల్లో జైనెప్ యెట్గిల్ తో తలపడనుంది. అటు శ్రీజ ఆకుల, మనికా బాత్రా, అర్చన గిరీష్ కామత్ లు మధ్యాహ్నం జర్మనీతో క్వార్టర్ ఫైనల్ ఆడనుండటంతో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు కూడా బరిలోకి దిగనుంది.
మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో మరో పతకం కచ్చితంగా తెస్తుందని భావిస్తున్న మీరాబాయి చాను కూడా బుధవారమే తన వేట ప్రారంభించనుంది. రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన ఇండియా తొలి వెయిట్ లిఫ్టర్ గా ఆమె నిలవడానికి ప్రయత్నిస్తోంది.
ఇండియా 12వ రోజు షెడ్యూల్ ఇలా..
అథ్లెటిక్స్
మిక్స్ డ్ మారథాన్ వాక్ రిలే (మెడల్ రౌండ్): ప్రియాంక గోస్వామి, సూరజ్ పన్వార్ – ఉదయం 11 గంటలకు
పురుషుల హైజంప్ (క్వాలిఫికేషన్): సర్వేష్ కుషారే – మధ్యాహ్నం 1.35 గంటలకు
మహిళల 100 మీటర్ల హర్డిల్స్ (రౌండ్ 1): జ్యోతి యర్రాజీ (హీట్ 4) – మధ్యాహ్నం 1.45 గంటలకు
మహిళల జావెలిన్ త్రో (క్వాలిఫికేషన్): అన్ను రాణి – మధ్యాహ్నం 1.55 గంటలకు
పురుషుల ట్రిపుల్ జంప్ (క్వాలిఫికేషన్) – రాత్రి 10.45 గంటలకు
పురుషుల 3,000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ (ఫైనల్): అవినాష్ సాబ్లే – అర్ధరాత్రి 1.13 గంటలకు (ఆగస్టు 8, గురువారం)
గోల్ఫ్
మహిళల వ్యక్తిగత (రౌండ్ 1): అదితి అశోక్, దీక్షా డాగర్ – మధ్యాహ్నం 12.30 గంటలకు
టేబుల్ టెన్నిస్
మహిళల జట్టు (క్వార్టర్ ఫైనల్): భారత్ (శ్రీజా ఆకుల, మనికా బాత్రా, అర్చన గిరీష్ కామత్) వర్సెస్ జర్మనీ – మధ్యాహ్నం 1.30 గంటలకు
రెజ్లింగ్
మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీలు – అంతిమ్ పంగల్ – మధ్యాహ్నం 3.05 గంటలకు..
మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీలు (గోల్డ్ మెడల్ మ్యాచ్): వినేశ్ ఫోగట్ వర్సెస్ సారా హిల్డెబ్రాండ్ – రాత్రి 9.45 నుంచి..
వెయిట్ లిఫ్టింగ్
మహిళల 49 కేజీల (మెడల్ రౌండ్): సైఖోమ్ మీరాబాయి చాను – రాత్రి 11.00 గంటలు
Best Web Hosting Provider In India 2024
Source link