Tirumala : భక్తులకు అలర్ట్- ఆగస్టు12, 13 తేదీల్లో తిరుమల శ్రీవారి సెల్ ఫోన్లు, వాచీల వేలం

Best Web Hosting Provider In India 2024

Tirumala Cellphone Watches : తిరుమల శ్రీవారికి, టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన సెల్‌ఫోన్లు, వాచ్ ల టెండర్ కమ్ వేలం ఆగస్టు 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. వీటిల్లో ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న సెల్ ఫోన్‌లు 22 లాట్లు ఉంటాయని టీటీడీ తెలిపింది.

సెల్ ఫోన్, వాచీల లాట్ లు

మైక్రోసాఫ్ట్, సామ్ సంగ్, షియోమీ, ఎల్జీ, మోటోరోలా, సోనీ, రెడ్ మీ, ఐటెల్, లెనోవో, రియల్ మీ, పోకో , హానర్, మైక్రోమాక్స్, నోకియా, కార్బన్, లావా, జియో, సెల్ కాన్, ఎల్ఎఫ్వై, ఇతర బ్రాండ్ల సెల్ ఫోన్‌లు ఉన్నాయి. టైటాన్, ఫాస్ట్ ట్రాక్, సొనాటా, హెచ్‌టీసీ, క్యాసియో, టైమెక్స్, స్మార్ట్, సిటిజెన్, టైమ్స్, టైమ్ వెల్, ఫాసిల్‌తో సహా ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు (13 లాట్‌లు) అందుబాటులో ఉన్నాయి. ఆసక్తికలవారు మరిన్ని వివరాల కోసం జనరల్ మేనేజర్/ఏఈవో (వేలం) టీటీడీ, హరేకృష్ణ మార్గ్, తిరుపతి వద్ద సంప్రదించవచ్చు లేదా 08772264429 నెంబర్ ను సంప్రదించవచ్చు లేదా TTD వెబ్‌సైట్ http://tirumala.org ను సందర్శించవచ్చు.

దర్శనం టిక్కెట్లు బుకింగ్ కోసం మధ్యవర్తులను సంప్రదించవద్దు

తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు మధ్యవర్తులను సంప్రదించవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఇటీవల 545 మంది వినియోగదారుల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించామని టీటీడీ పేర్కొంది. అనుమానిత లావాదేవీలను గుర్తించి, వీరిలో కొందరిని టీటీడీ బ్లాక్ చేసింది. వారికి ముందస్తు సమాచారం సైతం అందించింది. మధ్యవర్తుల నుంచి కొంతమంది వినియోగదారులు 225 శ్రీవాణి టిక్కెట్‌లను బుక్ చేసుకున్నట్లు టీటీడీ గుర్తించింది. ఈ అనుమానిత వ్యక్తులు దర్శనానికి వచ్చినప్పుడల్లా టీటీడీ విజిలెన్స్ తనిఖీలు చేస్తోంది.

దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌లలో నకిలీ ఐడీలతో దర్శనానికి వచ్చే యాత్రికులను కూడా టీటీడీ విజిలెన్స్ గుర్తిస్తోంది. అందువల్ల యాత్రికులు మధ్యవర్తుల వద్దకు వెళ్లవద్దని, ఆన్‌లైన్ లేదా కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అవకతవకలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

TirumalaTtdTirupatiTelugu NewsAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024