Best Web Hosting Provider In India 2024
తిక్డమ్ సినిమా ఇప్పటికే కొన్ని ఫిల్మ్ ఫెస్టివళ్లలో ప్రదర్శితమైంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ హూస్టన్‌లో స్క్రీనింగ్ అయిన ఈ మూవీకి ఓ స్పెషల్ అవార్డు కూడా వచ్చింది. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో అమిత్ సియాల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ తిక్డమ్ సినిమా ఎట్టకేలకు నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్కు వస్తోంది. నేడు (ఆగస్టు 7) టీజర్ రాగా.. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
టీజర్ ఇలా..
తిక్డమ్ సినిమా టీజర్‌ను జియోసినిమా ఓటీటీ నేడు తీసుకొచ్చింది. తమ ఊరిలో ప్రశాంతంగా జీవిస్తున్న ప్రకాశ్ (అమిత్ సియాల్).. పని లేకపోవటంతో సిటీకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అయితే, ఇది పిల్లలకు ఇష్టం ఉండదు. అయినా, తండ్రి వెంట నగరానికి వెళతారు. అక్కడ ఉద్యోగం దక్కించుకునేందుకు ప్రకాశ్ నానా కష్టాలు పడుతుంటారు. అతడిని పిల్లలు ఓదారుస్తుంటారు. ఇలా ఎమోషనల్‌గా, సరదాగా ఈ టీజర్ సాగింది.
తిక్డమ్ చిత్రానికి వివేక్ అర్చాలియా దర్శకత్వం వహించారు. హృదయాన్ని హత్తుకునేలా ఈ ఎమోషనల్ డ్రామా మూవీని ఆయన తెరక్కించారు. ఈ చిత్రంలో అమిత్ సియాల్తో పాటు దివ్యాంశ్ ద్వివేది, భాను, ఆరోషి సౌద్, అర్షిత్ జైన్, నాయన్ భట్, అజిత్ సర్వోత్తమ్ కీలకపాత్రలు పోషించారు.
స్ట్రీమింగ్ డేట్
తిక్డమ్ సినిమా ఆగస్టు 23వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. టీజర్‌తో పాటే స్ట్రీమింగ్ డేట్‌ను ఆ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది. తిక్డమ్ సినిమా సంతోషంతో పాటు స్ఫూర్తి కలిగిస్తుందని జియోసినిమా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కుటుంబ బంధం, ఐకమత్యం శక్తిని తిక్డమ్లో చూడండి అంటూ రాసుకొచ్చింది. ఆగస్టు 23 నుంచి ఈ చిత్రాన్ని జియో సినిమాలో చూడొచ్చని పేర్కొంది.
తిక్డమ్ మూవీని జ్యోతి దేశ్‌పాండే, పూనమ్ ష్రాఫ్, పార్థ్ గజ్జర్, సావియో షెనోయ్, శ్వేత శర్మ కలిసి నిర్మించారు. డానియెల్ బీ జార్జ్ సంగీతం అందించిన ఈ మూవీకి సత్య శర్మ ఎడిటింగ్ చేశారు.
ఘూడ్చాడీ కూడా నేరుగానే..
ఘూడ్చాడీ సినిమా కూడా నేరుగా జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో నేరుగా స్ట్రీమింగ్కు రానుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఈ వారమే ఆగస్టు 9న స్ట్రీమింగ్కు వస్తుంది. సంజయ్ దత్, రవీనా టాండన్, పార్థ్ సమ్తాన్, ఖుశాలీ కుమార్ ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేశారు. బినోయ్ కే గాంధీ దర్శకత్వం వహించారు. రెండు తరాల వారి మధ్య లవ్ స్టోరీతో ఈ చిత్రం వస్తోంది. ఆగస్టు 9 నుంచి ఈ ఘూడ్చాడీ చిత్రాన్ని జియో సినిమా ఓటీటీలో చూడొచ్చు.