Karthika deepam august 9th: జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. శౌర్య ఇంటికి వచ్చేస్తుందన్న సంబరంలో శోభ

Best Web Hosting Provider In India 2024


Karthika deepam 2 serial today august 9th episode: కార్తీక్ నువ్వు ఎక్కడికి వెళ్లకు, నువ్వు వెళ్తే బూచోడు నన్ను పట్టుకుపోతాడు. ఇప్పటి వరకు బూచోడు వస్తాడని భయంతో దాక్కున్నా. నీ గొంతు విని బయటకు వచ్చాను. నిజంగానే బూచోడు వస్తాడా? అని అడుగుతుంది. రాడని అంటాడు. మరి జో చెప్పింది కదా అంటుంది.

 

జ్యోత్స్న మీదకు చెయ్యి ఎత్తిన కార్తీక్

శౌర్య గురించి డాక్టర్ చెప్పిన మాటలు కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. ఎవరూ రారని శౌర్యకు నచ్చజెప్పి ఇంట్లోకి పంపిస్తాడు. కార్తీక్ ఆవేశంగా జ్యోత్స్న దగ్గరకు వెళతాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు? కాస్త అయినా బుద్ధి ఉందా అని అంటాడు.

 

నాకు లేదు నీకు ఉందా అని అడుగుతుంది. దీంతో కార్తీక్ కోపంగా జ్యోత్స్న అని తన మీదకు చెయ్యి ఎత్తుతాడు. నువ్వు అన్న మాటలకు శౌర్య భయపడిపోయిందని అంటాడు. నీ విషయంలో తప్పు చేస్తే నీకు కొట్టే హక్కు ఉంది కానీ దీప విషయంలో నువ్వు ఎందుకు రైట్ తీసుకుంటున్నావని నిలదీస్తుంది.

 

నేను చెప్పింది జరగబోయే నిజమని జ్యోత్స్న అంటే అది జరగనివ్వనని అంటాడు. శౌర్యను ఇబ్బంది పెట్టె ఏ పని చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు. అదంతా సుమిత్ర చూస్తుంది. తన పరిస్థితి గురించి ఒక్కరూ కూడా పాజిటివ్ గా ఆలోచించడం లేదని బాధపడతాడు.

 

బాధలో అనసూయ

నీ కూతురు అన్నింటికీ అనుమానమే కాస్త నువ్వు అయినా సర్ది చెప్పమని చెప్తాడు. జ్యోత్స్న మాత్రం వినిపించుకోదు. శౌర్యను వాళ్ళ నాన్న తీసుకెళ్లిపోతాడని చెప్పాను నిజమే కదా. కోర్టు ఇదే తీర్పు ఇస్తుంది. అప్పుడే దీప అపలేదు, ఈ శ్రేయోభిలాషి ఆపలేడని అంటుంది.

 

అనసూయ కోర్టులో దీప మీద నిందలు పడిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది. నరసింహ వచ్చి సంతోషంగా కేసులో గెలిచేది మనమే నీ మనవరాలు ఇంటికి వచ్చేస్తుంది. శోభ నువ్వు రేపటి నుంచి అమ్మవి కాబోతున్నావని అంటాడు. కూతురి బాధ్యతలు తండ్రికి బాధ్యత అప్పగిస్తున్నామని కోర్టు తీర్పు ఇస్తుందని అంటాడు.

 

సంబరంలో శోభ

రేపు కోర్టుకు రానని అనసూయ చెప్తుంది. ఏంటి ఏదో తేడాగా ఉందని శోభ అడుగుతుంది. శౌర్య రాగానే తన కోసం షాపింగ్ చేద్దాం, దాని పాత స్కూల్ మాన్పించి కొత్త స్కూల్ లో వేద్దాం, ముందు దాని పేరు మార్చి మా అమ్మ పేరు నాంచారి పెట్టుకుంటాను. తల్లి పేరుగా దీపను తీసేసి నా పేరు రాసుకుంటాను. అప్పుడు దీప తల్లిగా చచ్చినట్టేనని శోభ తెగ ఆనందపడిపోతుంది.

 

దీప పరిస్థితులన్నీ తలుచుకుని భయపడుతుంది. నేను రేపు విడాకులు అడిగితే నువ్వు ఇంక ఎంత తెగిస్తావోనని భయంగా ఉంది. కోర్టు రేపు శౌర్యను నీకు అప్పగించమని చెప్తే నేను చచ్చిపోయినట్టే. దీని మీద నీ నీడ కూడా పడకూడదు. నా కూతురిని ఎలాగైనా కాపాడుకుంటానని అనుకుంటుంది.

 

శౌర్య కోసం ఏమైనా చేస్తాడా?

కూతురిని కౌగలించుకుని దీప చాలా ఏడుస్తుంది. జ్యోత్స్న కార్తీక్ గురించి తలుచుకుని రగిలిపోతుంది. అసలు ఏమనుకుంటున్నాడు బావ. శౌర్య కోసం దీపను ఇంటికి తీసుకొచ్చాడు. శౌర్య కోసం తండ్రినని చెప్పాడు. ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇప్పుడు శౌర్య కోసం నన్ను కొట్టడానికి చెయ్యి ఎత్తాడు.

 

శౌర్య కోసం ఏదైనా చేస్తాడా? మూడు నెలల ముందు వరకు పరిచయం లేని పిల్ల కోసం ఇంత చేయాల్సిన అవసరం ఏంటి? శౌర్య మీద ఇంత ప్రేమ ఎందుకు నేను భరించలేకపోతున్నాను. నువ్వు ఎంత దూరం జరిగినా నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా నిన్ను వదిలిపెట్టను.

 

నేను పుట్టడం నీ భార్యగా పుట్టాను, నీ భార్యగానే చస్తాను. ఇవన్నీ జరగడానికి కారణం శౌర్య. రేపు కోర్టు తీర్పు నరసింహకు అనుకూలంగా వస్తుంది. దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. శౌర్య వెళ్లిపోతే దీప ఎందుకు ఉంటుంది. అది వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఏంటో చూపిస్తాను అంటుంది.

 

కోర్టు దగ్గర దీప ఒంటరిగా ఉంటే నరసింహ వచ్చి వెటకారంగా మాట్లాడతాడు. దీప ధీటుగా సమాధానం ఇస్తుంది. కోర్టు నుంచి వెళ్లేటప్పుడు దీప కళ్ళలో నీళ్ళు కాదు రక్తం చూస్తానని అంటాడు. వాళ్ళు వెళ్లిపోగానే పారిజాతం, జ్యోత్స్న వచ్చి మాట్లాడతారు. మా ఇంటి పరువు తీశావ్ కదా అని పారిజాతం దీపను తిడుతుంది.

 

 

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024