Best Web Hosting Provider In India 2024

Sanjay Dutt About Charmy Kaur Ram Pothineni: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న మరో హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్‘. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కావ్య థాపర్ హీరోయన్‌గా చేస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీలో విలన్‌గా పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఇక తాజాగా గురువారం (ఆగస్ట్ 8) డబుల్ ఇస్మార్ట్ నుంచి బిగ్ బుల్ అనే స్పెషల్ సాంగ్ లాంచ్ చేశారు మేకర్స్. పూరి జగన్నాథ్ తన విలన్‌లను పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌ని ప్రెజెంట్ చేయడంలోస్పెషలిస్ట్. ఇప్పుడు ఆయన డబుల్ ఇస్మార్ట్‌లో మెయిన్ విలన్‌పై ఒక పాటను ఇంక్లూడ్ చేశారు.
బిగ్ బుల్ క్యారెక్టర్‌ని సంజయ్ దత్ పోషించారు. మణి శర్మ కంపోజ్ చేసిన “బిగ్ బుల్” విజువల్, మ్యూజికల్‌గా పవర్‌ఫుల్ నెంబర్. హై ఎనర్జీ, పండుగ వాతావరణంలో సెట్ చేయబడిన ఈ పాటకు కావ్య థాపర్ గ్లామర్ టచ్ యాడ్ చేసింది. సినిమాలోని కీలక పాత్రలను ఒకచోట చేర్చింది. వారి పెర్ఫార్మెన్స్ డ్యాన్స్ ఫ్లోర్‌ను అదరగొట్టనుంది. భాస్కరభట్ల రవి కుమార్ సాహిత్యం బిగ్ బుల్ పాత్ర ఎసెన్స్‌ని ప్రజెంట్ చేస్తోంది. పృధ్వీ చం, సంజన కల్మంజే వోకల్స్ ట్రాక్‌కి మరింత ఎనర్జీని ఇచ్చాయి.
అయితే, డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి బిగ్ బుల్ పాటను రిలీజ్ చేస్తూ మేకర్స్ ముంబైలో గ్రాండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్తే. తెలుగు సినిమా డైనమిక్స్‌ని మార్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసి, బిగ్ బుల్‌గా ప్రజెంట్ చేస్తున్న పూరి సర్‌కి థాంక్ యూ” అని చెప్పారు.
“ఛార్మి పరేషాన్ చేసింది (నవ్వుతూ). తన హార్డ్ వర్క్, డెడికేషన్, ఫోకస్ వలనే ప్రోడక్ట్ అంత అద్భుతంగా వచ్చింది. హీరోయిన్ కావ్య ఇందులో చాలా బ్యూటీఫుల్‌గా కనిపించింది. విషుకి థాంక్ యూ. రామ్ నా యంగర్ బ్రదర్ లాంటి వాడు. తనకు పని చేయడం చాలా మజా వచ్చింది. డబుల్ ఇస్మార్ట్‌గా మస్త్ ఉంటాడు. తనతో వర్క్ చేయడం ప్లెజర్ అండ్ హానర్” అని సంజయ్ దత్ తెలిపారు.
“రామ్ పోతినేని గుడ్ పెర్ఫార్మర్. వెరీ హార్డ్ వర్కర్. తన ఫన్‌తో ఈ సినిమా చేశాం. చాలా చోట్ల తిరిగాం. చాలా మస్తీ చేశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు. అందరికీ థాంక్ యూ” అని బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ చెప్పుకొచ్చారు.
Best Web Hosting Provider In India 2024
Source / Credits