Vankaya Pachi Karam: వంకాయ పచ్చికారం వేపుడు ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది, వేడి వేడి అన్నంలో తిని చూడండి

Best Web Hosting Provider In India 2024


Vankaya Pachi Karam: వంకాయతో చేసిన వంటకాలంటే ఎంతో మంది ముఖం ముడుచుకుంటారు. కానీ ఇక్కడ మేము ఇచ్చని వేపుడు చేసుకుంటే మాత్రం వంకాయ నచ్చని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం చాలా సులువు. కేవలం అరగంటలో రెడీ అయిపోతుంది. వంకాయ రెసిపీలో ఇది ప్రత్యేకమైన వంటకం అని చెప్పుకోవచ్చు. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

వంకాయ పచ్చికారం రెసిపీకి కావాల్సిన పదార్థాలు

వంకాయలు – పావు కిలో

నూనె – తగినంత

ఎండు మిర్చి – మూడు

పసుపు – పావు స్పూను

పచ్చిమిర్చి – ఆరు

కొత్తిమీర – చిన్న కట్ట

అల్లం – చిన్న ముక్క

వెల్లుల్లి రెబ్బలు – ఆరు

జీలకర్ర – ఒకటిన్నర స్పూను

ధనియాలు – ఒక స్పూను

ఉప్పు – రుచికి సరిపడా

గరం మసాలా – అర స్పూను

వంకాయ పచ్చికారం రెసిపీ

1. ఈ రెసిపీ కోసం లేత తెల్ల వంకాయలను ఎంపిక చేసుకోవాలి. వాటిని పెద్ద ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు మిక్సీలో పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, అరస్పూను జీలకర్ర, ధనియాలు వేసి మెత్తగా రుబ్బుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. పచ్చికారం సిద్ధమైనట్టే.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో ఒక స్పూను జీలకర్ర వేసి వేయించాలి.

4. అందులోనే ఎండుమిర్చి, పసుపు కూడా వేసి వేయించాలి.

5. ఆ నూనెలో ముందుగా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి చిన్న మంట మీద బాగా మగ్గించాలి.

6. వంకాయలు 70 శాతం ఉడికేదాకా మగ్గించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.

7. వంకాయలు బాగా మగ్గాక ముందుగా చేసిన పెట్టుకున్న పచ్చికారాన్ని వేసి బాగా కలుపుకోవాలి.

8. చిన్న మంట వేయించాలి. మాడుతున్నట్టు అనిపిస్తే కొంచెం నీరు వేయచ్చు.

9. పావు గంట సేపు చిన్న మంట మీద ఉడికిస్తే టేస్టీ వంకాయ పచ్చికారం కూర రెడీ అయినట్టే.

10. వేడి వేడి అన్నంలో ఈ రెసిపీని తింటే రుచి అదిరిపోతుంది.

వంకాయలు తినడానికి ఇష్టపడని వారిలో మీరూ ఉన్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వంకాయలు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంకాయ తినడం వల్ల చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు వంకాయ కూర తినడం చాలా ముఖ్యం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడంతో పాటూ ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో వంకాయలు ముందుంటాయి. వంకాయల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మీ శరీర కణానలు కాపాడతాయి. కాబట్టి వంకాయలను వారానికి కనీసం రెండు సార్లు తినడం చాలా ముఖ్యం.

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024