Best Web Hosting Provider In India 2024
Vinesh Phogat: వినేష్ ఫోగట్ ఫైనల్ పోటీల ముందు డిస్ క్వాలిఫై కావడం ఒలింపిక్స్‌లో సంచలనంగా మారింది. పారిస్ ఒలింపిక్స్‌లో యాభై కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేష్ పోగట్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ఘనతను సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్రను సృష్టించింది. ఫైనల్‌లోనూ విజయం సాధించి ఇండియాకు వినేష్ గోల్డ్ మెడల్ సాధించడం ఖాయమని అభిమానులు ఆనందపడ్డారు.
కానీ ఫైనల్ పోటీకి ముందు నిర్వహించిన బరువు పరీక్షలో వినేష్ వంద గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెను ఒలింపిక్ కమిటీ డిస్ క్వాలిఫై చేసింది. దాంతో వినేష్ ఒలింపిక్ మెడల్ ఆశలు ఆవిరయ్యాయి. అయితే తన అనర్హత వేటుపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో కలిసి వినేష్ పోగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను (సీఏఎస్) ఆశ్రయించింది.
సిల్వర్ మెడల్ ఇవ్వాలి…
కనీసం తనకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని వినేష్ ఈ పిటీషన్‌లో పేర్కొన్నది. సెమీస్ వరకు తన బరవు యాభై కిలోల కంటే తక్కువగానే ఉందని, ఆ రూల్స్ పక్రారం తనకు సిల్వర్ మెడల్‌కు అర్హురాలినేనంటూ వినేష్ ఈ పిటీషన్‌లో అభ్యర్తించినట్లు తెలిసింది. వినేష్ పిటీషన్‌ను సీఏఎస్ స్వీకరించింది. వినేష్ పిటీషన్‌ను సీఏఎస్ స్వీకరించిందంటే తప్పకుండా ఆమెకు సిల్వర్ మెడల్ దక్కే అవకాశం ఉంటుందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వర్గాలు చెబుతోన్నాయి.
మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత…
ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత వినేష్ పిటిషన్‌పై సీఏఎస్ తీర్పును వెలువరించే అవకాశం ఉందని అంటున్నారు. వినేష్‌కు సిల్వర్ మెడల్ దక్కేందుకు అర్హత ఉందని అభిమానులు ట్వీట్లు, కామెంట్స్ పెడుతోన్నారు.
రెజ్లింగ్‌కు గుడ్‌బై
ఒలింపిక్స్ ఫైనల్ నుంచి డిస్ క్వాలిఫై కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన వినేష్ ఫోగాట్ రెజ్లింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. అమ్మా రెజ్లింగ్ నువ్వే గెలిచావు. నేను ఓడిపోయాను. దయచేసి నన్ను క్షమించు. నీ కలలు, నీ ధైర్యం అన్నీ కల్లలయ్యాయి. ఇక నా దగ్గర పోరాడే శక్తి లేదు. గుడ్ బై రెజ్లింగ్. అందరికీ రుణపడి ఉంటాను. క్షమించండి అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
రీఎంట్రీ ఇవ్వాలి…
గతంలో రెండు ఒలింపిక్స్ లో వినేశ్ పోటీ చేసినా మెడల్ సాధించలేకపోయింది. ఈసారి ప్రపంచ ఛాంపియన్లను కూడా ఓడించి ఫైనల్ చేరి మెడల్ ఖాయం చేసుకున్న తరుణంలో ఇలా జరగగడం ఆమెను కోలుకోలేని దెబ్బ కొట్టింది. రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వినేష్ పోగాట్‌ను అభిమానులు కోరుతున్నారు.