Warangal : వరంగల్ ఎంజీఎం వద్ద దారుణం – మూడు రోజుల పసికందును పీక్కుతిన్న కుక్కలు

Best Web Hosting Provider In India 2024


వరంగల్ ఎంజీఎం ఆవరణలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. రెండు, మూడు రోజుల వయసుండే శిశువును కుక్కలు పట్టుకొచ్చి పీక్కుతింటుండటంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా కంగు తిన్నారు. అప్పటికే శిశువు మృతి చెంది ఉండటం, సగం శరీరం కుక్కలు తినేసిన ఆనవాళ్లు కనిపిస్తుండటంతో అక్కడి జనాలంతా భయాందోళనకు గురయ్యారు.

 

ఎంజీఎం డ్యూటీ లో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, రోగుల బంధువులు గమనించి కుక్కలను చెదర గొట్టారు. మృత శిశువును ఎంజీఎం మార్చురీలో భద్ర పరిచారు. కాగా శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది.

 

దీంతో ఆసుపత్రి వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. కాగా విషయం తెలుసుకున్న వరంగల్ నగర ఏసీపీ నందిరాం నాయక్, ఎంజీఎం అధికారులు వెంటనే అలెర్ట్ అయ్యారు. సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆల్రెడీ శిశువు దేహం సగం వరకు కుక్కలు పీక్కు తినడంతో మృత శిశువు ఆడనా, మగనా అనేది తెలియ రాలేదు. ఎంజీఎం లోని పిడియాట్రిక్ వార్డులోని శిశువు మృత దేహమేననే ప్రచారం జరగగా.. ఆసుపత్రి సిబ్బంది తో పాటు ఎంజీఎం కు వివిధ సేవల నిమిత్తం వచ్చిన రోగులు, బంధువుల్లోనూ తీవ్ర భయాందోళన కనిపించింది.

 

విచారణ చేపట్టిన అధికారులు

ఎంజీఎం ఆవరణలోనే కుక్కలు శిశువును పీక్కు తింటూ కనిపించడంతో అధికారులు వెంటనే అలెర్ట్ అయ్యారు. శిశువు ఎంజీఎం పిల్లల వార్డుకు సంబంధించిందా లేదా బయట నుంచి కుక్కలు శిశువు మృత దేహాన్ని తీసుకువచ్చాయా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పిడియాట్రిక్ వార్డులో పిల్లల అడ్మిషన్లకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈ రెండు రోజుల్లో ఆసుపత్రికి వచ్చిన గర్భిణులు, బాలింతల వివరాల గురించి ఆరా తీసే పనిలో పడ్డారు. కానీ అక్కడ ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇతరులు ఎవరైనా శిశువు మృతదేహాన్ని తీసుకొచ్చి ఎంజీఎం ఆవరణలో పడేసి ఉంటారా అనే అనుమానం కూడా అధికారులు వ్యక్తం చేశారు.

 

ఎంజీఎంకు చెందిన శిశువు కాదు: సూపరింటెండెంట్ మురళి

ఎంజీఎం ఆవరణలో శిశువు మృత దేహాన్ని కుక్కలు తింటూ కనిపించడం కలకలం రేపగా.. ఆసుపత్రి సూపరింటెండెంట్ సీహెచ్ మురళీ వెంటనే విచారణ చేపట్టారు. పిడియాట్రిక్ వింగ్ లోని నియోనాటల్ ఐసీయు వార్డులో ఉన్న పిల్లల వివరాలు సేకరించారు.

 

మిగతా విభాగాల్లో కూడా ఆరా తీశారు. కానీ శిశువు కనిపించకుండా పోయినట్టుగానో.. చనిపోయినట్టుగానో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అంతే కాకుండా ఎవరినీ నుంచి కూడా ఫిర్యాదు అందకపోవడంతో చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చిన శిశువు కాదని నిర్ధారణకు వచ్చినట్టు సూపరింటెండెంట్ సిహెచ్ మురళీ స్పష్టం చేశారు.

 

శిశివు మృతదేహాన్ని కుక్కలు బయట నుంచి తీసుకుని వచ్చి ఉండొచ్చని భావిస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఎంజీఎం ఆసుపత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారని, పూర్తి క్లారిటీ లేకుండా ఇలాంటి ఘటనలను ఎంజీఎం కు అపాదించోద్దని విజ్ఞప్తి చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలో సురక్షిత వైద్యం అందిస్తున్నామని, ప్రజల్లో హాస్పిటల్ పై ఉన్న విశ్వాసాన్ని పోగొట్టొద్దని సూపరింటెండెంట్ మురళీ కోరారు.

 

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

 

టాపిక్

WarangalTelangana NewsCrime News

Source / Credits

Best Web Hosting Provider In India 2024