Plane crash : తీవ్ర విషాదం- కుప్పకూలిన విమానం.. 62 మంది దుర్మరణం!

Best Web Hosting Provider In India 2024


బ్రెజిల్​లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రాంతీయ టర్బోప్రాప్ విమానం శుక్రవారం సావో పాలో రాష్ట్రంలోని విన్హెడో నగరంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని మొత్తం 62 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

 

వోపాస్ లిన్హాస్ ఏరియాస్ సంస్థ నడుపుతున్న ఏటీఆర్-72 విమానం పరానా రాష్ట్రంలోని కాస్కావెల్ నుంచి సావో పాలోలోని గ్వారుల్హోస్​కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక వార్తా సంస్థ జీ1 తెలిపింది. సావో పాలోకు వాయువ్యంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న విన్హెడో అనే పట్టణంలో బ్రెజిల్​ విమానం కుప్పకూలింది.

 

దట్టమైన అటవీ ప్రాంతంలో విమానం కూలిన క్షణం, ఆ తర్వాత ప్రభావిత ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు ఎగసిపడటం వంటి దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

 

బ్రెజిల్​ విమాన ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని విన్హెడో సమీపంలోని వాలిన్హోస్ అధికారులు నివేదించారు. సమీపంలోని కండోమినియం కాంప్లెక్స్​లోని ఒక ఇల్లు ధ్వంసమైందని, అయితే నివాసితులు ఎవరూ గాయపడలేదని వివరించారు.

 

స్థానిక టీవీ స్టేషన్ గ్లోబోన్యూస్​లో ప్రసారమైన ఫుటేజీలో బ్రెజిల్​ విమానం ప్రమాదం దృశ్యాలు కనిపించాయి. విమానం కూలిపోయే ముందు కిందికి దూసుకెళ్లినట్లు వీడియోలో కనిపించింది.

 

బ్రెజిల్​ విమాన ప్రమాదం జరిగిన తర్వాత అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా మాట్లాడుతూ.. “నేను బాధాకరమైన వార్తను చెప్పాల్సి వస్తోంది,” అని అన్నారు.

 

58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సావోపాలోలోని విన్హెడో నగరంలో ఓ విమానం కూలిపోయిందని, అందరూ చనిపోయారని అధ్యక్షుడు అన్నారు.

 

ప్రమాద బాధితులకు ఒక క్షణం మౌనం పాటించాలని కోరారు.

 

పీఎస్-వీపీబీగా నమోదైన ఈ విమానం ఎందుకు కూలిపోయిందనే దానిపై మరిన్ని వివరాలను విమానయాన సంస్థ ఇవ్వలేదు.

 

బ్రెజిల్​ విమాన ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే సావో పాలో రాష్ట్ర అగ్నిమాపక దళం ఏడు బృందాలను సంఘటనా స్థలానికి పంపింది. “విమాన ప్రమాదం నేపథ్యంలో 7 బృందాలు ఘటనాస్థలానికి వెళ్లాయి. ఇప్పటివరకు ఈ సమాచారం మాత్రమే ఉంది,” అని సావో పాలో అగ్నిమాపక విభాగం ఎక్స్​లో రాసింది.

 

విమానం శిథితాలు, దట్టమైన పొగలు వెలువడటంతో ప్రమాదం జరిగిన ప్రాంతం మొత్తం మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.

 

ఈ విమానాన్ని ఏటీఆర్ 72-500 టర్బోప్రాప్ గా ఫ్లైట్ రాడార్ 24 గుర్తించింది. ఈ విమానాన్ని తయారు చేసే ఏటీఆర్ సంస్థ ఎయిర్ బస్, ఇటాలియన్ ఏరోస్పేస్ గ్రూప్ లియోనార్డో సహ యాజమాన్యంలో ఉంది.

 

 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source link