Best Web Hosting Provider In India 2024
Aman Sehrawat: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరో మెడల్‌ను సొంతం చేసుకున్నది. రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్ కాంస్య పతకం గెలిచాడు. శుక్రవారం రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో కాంస్య పతక పోరులో ప్యూర్టోరికాకు చెందిన డారియన్ క్రజ్‌పై 13-5 తేడాతో అమన్ అద్భుత విజయాన్ని అందుకున్నాడు.
ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించిన అమన్… ఫస్ట్ హాఫ్‌లో ఆరు, సెకండ్ హాఫ్‌లో ఏడు పాయింట్లు సాధించాడు. డారియన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. సెమీస్‌లో చేసిన తప్పులను కాంస్య పోరులో రిపీట్ చేయకుండా జాగ్రత్తపడ్డాడు. సెకండ్ హాఫ్‌లో అమన్ దూకుడుకు డారియన్ చేతులెత్తేశాడు.
అమన్ రికార్డ్…
భారత్ తరఫున ఒలింపిక్ మెడల్ గెలిచిన అతి చిన్న వయస్కుడిగా అమన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 21 ఏళ్ల 24 రోజుల్లో అమన్ కాంస్యం గెలిచాడు. 21 ఏళ్ల 44 రోజుల్లో పీవీ సింధు మెడల్ గెలవగా…22 ఏళ్ల వయసులో విజేందర్ సింగ్ బాక్సింగ్‌లో కాంస్యం సాధించాడు.
మొత్తంగా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం కాగా…రెజ్లింగ్‌లో మొదటిది. గురువారం జావెలిన్ త్రోలో నీరజ్ సిల్వర్ మెడల్, హాకీ టీమ్ కాంస్య పతకం గెలవగా…శుక్రవారం రెజ్లింగ్‌లో మరో కాంస్య పతకం రావడంతో క్రీడాభిమానులు సంబరపడుతున్నారు.
మోదీ అభినందనలు…
ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన అమన్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపాడు. అమన్ విజయాన్ని దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుందని మోదీ ట్వీట్ చేశాడు. మోదీతో పాటు పలువురు రాజకీ, క్రీడా, సినీ ప్రముఖులు అమన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఏడో మెడల్…
అన్ని ఒలింపిక్స్‌లో కలిపి రెజ్లింగ్‌లో భారత్‌కు వచ్చిన ఏడో పతకం ఇది. గతంలో సుశీల్ కుమార్ రెండు మెడల్స్ గెలవగా…రవికుమార్, సాక్షి మాలిక్, యోగేశ్వర్ దత్, భజరంగ్ పూనియా మెడల్స్ సాధించారు. పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగాట్ కూడా ఫైనల్ చేరి పతకం ఖాయం చేసింది. బరువు ఎక్కువగా ఉండటంతో ఒలింపిక్స్ నుంచి డిస్ క్వాలిఫై అయ్యింది.
పతకాల పట్టికలో భారత్ ఒక సిల్వర్, ఐదు కాంస్యాలతో 69వ స్థానంలో ఉంది. 111 పతకాలతో అమెరికా టాప్ ప్లేస్‌లో కొనసాగుతోండగా…83 మెడల్స్‌తో చైనా రెండో స్థానంలో ఉంది.