Avatar 3 Title: అవతార్ 3 టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేసింది.. పోస్టర్‌తో కాన్సెప్ట్ చెప్పిన మేకర్స్

Best Web Hosting Provider In India 2024


Avatar 3 Title Announced: హాలీవుడ్ దర్శక దిగ్గజం డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తన సినిమాలతో వరల్డ్ వైడ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక అవతార్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందడమే కాకుండా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాతరు. మొదట 2009లో విడుదలైన అవతార్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.

 

అవతార్ సినిమా తర్వాత 13 ఏళ్లకు రెండో పార్ట్‌గా “అవతార్: ది వే ఆఫ్ వాటర్” మూవీ వచ్చి అంతకిమించిన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టింది. 2022లో వచ్చిన అవతార్ 2 మూవీ డిసెంబర్ 16న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ అవతార్ ఫ్రాంఛైజీ నుంచి మరో సినిమా రానుంది. అదే అవతార్ 3.

 

ఈ అవతార్ నుంచి వచ్చే మూడో పార్ట్‌కు తాజాగా మేకర్స్ టైటిల్ అనౌన్స్ చేశారు. అవతార్ 3కి “అవతార్: ఫైర్ అండ్ యాష్” టైటిల్ పెట్టినట్లు ఇవాళ (ఆగస్ట్ 10) ప్రకటించారు మేకర్స్. ఈ టైటిల్ అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ మొత్తం ఫైర్‌తో చాలా ఫెరోషియస్‌గా కనిపిస్తూ అట్రాక్ట్ చేసింది.

 

ఏ అనే ఆంగ్ల అక్షరం మొత్తం లావాలా కనిపిస్తూ “అవతార్: ఫైర్ అండ్ యాష్” టైటిల్ బ్లూ కలర్‌లో చాలా అట్రాక్టివ్‌గా ఉంది. అంతేకాకుండా అవతార్ 3 సినిమా విడుదల తేదిని కూడా ఈ పోస్ట్ ద్వారా వెల్లడించారు. “అవతార్: ఫైర్ అండ్ యాష్” మూవీని డిసెంబర్ 19, 2025లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అంటే అవతార్ 3 థియేటర్లలోకి రావడానికి ఇంకా సంవత్సరానికిపైగా సమయం ఉంది.

 

ఇదిలా ఉంటే, అవతార్ ఫ్రాంఛైజీని మొత్తం ఐదు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ప్రకటించారు. వాటిని పంచ భూతాల కాన్సెప్ట్‌తో తీస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్‌ను భూమిపై చిత్రీకరిస్తే.. రెండో పార్ట్‌ను నీటిలో తెరెక్కించారు. ఇక పంచభూతాల్లో ఒకటైన అగ్నితో అవతార్ మూడో పార్ట్ రానుంది.

 

కాగా ఈ అవతార్ ఫ్రాంఛైజీలో ఇంకా రెండు సినిమాలు మిగిలి ఉన్నాయి. వీటిని 2027, 2029 సంవత్సరాల్లో విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే, ఈ అవతార్ 4, అవతార్ 5 సినిమాల టైటిల్స్ ఇంకా ప్రకటించలేదు. వాటి పేర్లు, రిలీజ్ డేట్స్ ఇంకా వెల్లడించాల్సి ఉంది. వాటిని మిగతా ఎలిమెంట్స్ అయిన గాలి, స్పేస్‌లో తెరకెక్కించే అవకాశం ఉంది.

 

 

 

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024