Olympics 2024: ఒలింపిక్స్ లో కాంస్యం మిస్స‌యిన ఈ అథ్లెట్‌ పేరు ఇండియా !

Best Web Hosting Provider In India 2024


Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ ఇండియా బ్రాంజ్ మెడ‌ల్‌ను తృటిలో మిస్స‌యింది. ఒక‌వేళ ఇండియా గెలిస్తే మాత్రం మెడ‌ల్ నెద‌ర్లాండ్స్ ఖ‌తాలో ప‌డేది. ఇండియా ప‌త‌కం గెలిస్తే నెద‌ర్లాండ్స్ ఖాతాలో ప‌త‌కం చేర‌డం ఏమిట‌ని అనుకుంటున్నారు. ఒలింపిక్స్ బ‌రిలో నిలిచిన అథ్లెట్ పేరు ఇండియా స‌ర్ద్‌జాయ్‌. ఈ సారి ఒలింపిక్స్‌లో కొత్త‌గా బ్రేకింగ్ డ్యాన్స్ ఈవెంట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.

ఈ ఈవెంట్‌లో నెద‌ర్లాండ్స్ త‌ర‌ఫున ఇండియా స‌ర్ధ్‌జాయ్ బ‌రిలో నిలిచింది. ఫైన‌ల్ చేరి ప‌త‌కం గెలిచేలా క‌నిపించింది ఇండియా. సెమీస్‌లో ఓట‌మి పాలైంది. ఆ త‌ర్వాత జ‌రిగిన బ్రాంజ్ మెడ‌ల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన ప్లేయ‌ర్ చేతిలో ఓట‌మి పాలై నాలుగో స్థానంలో నిలిచింది ఇండియా.

అస‌లు పేరు తోనే…

బ్రేకింగ్ ఈవెంట్‌లో అథ్లెట్లు బీ గ‌ర్ల్స్‌, బీ బాయ్స్ పేరుతో బ‌రిలో దిగుతుంటారు. కానీ ఇండియా స‌ర్ధ్‌జాయ్ మాత్రం అస‌లు పేరుతోనే పోటీలోనిలిచింది.

పేరు ముందు ఇండియా అని ఉండ‌టంతో నెద‌ర్లాండ్స్ అథ్లెట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆమె పేరును నెటిజ‌న్లు తెగ షేర్ చేస్తున్నారు.ఒలింపిక్స్ బ‌రిలో నిలిచిన ఇండియా స‌ర్ద్‌జాయ్ వ‌య‌సు 18 ఏళ్లు మాత్ర‌మే. బ్రేక్ డ్యాన్సింగ్ ఈవెంట్‌లో పోటీప‌డిన అతి చిన్న వ‌య‌స్కురాలైన అథ్లెట్‌గా ఇండియా నిలిచింది.

ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ కావాల‌నుకొని…

తొలుత ఫుట్‌బాట్ ప్లేయ‌ర్ కావాల‌ని క‌ల‌లు క‌న్న ఇండియా…డ్యాన్స్‌పై మ‌క్కువ‌తో బ్రేక్ డ్యాన్సింగ్ వైపు ఆక‌ర్షితురాలైంది. బ్రేకింగ్ ఈవెంట్‌లో ప‌దేళ్ల వ‌య‌సులోనే యూరోపియ‌న్ ఛాంపియ‌న్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత ప‌ద‌హారేళ్ల‌కే వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ టైటిల్ గెలుచుకున్న‌ది.

కాగా నెద‌ర్లాండ్స్ ఈ ఒలింపిక్స్‌లో 29 ప‌త‌కాలు గెలిచి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్‌లో ఒక సిల్వ‌ర్ మెడ‌ల్‌, నాలుగు కాంస్య ప‌త‌కాలు గెలిచిన ఇండియా 69వ స్థానంలో కొన‌సాగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌, సిల్వ‌ర్ మెడ‌ల్ స‌హా ఇండియాకు ఏడు ప‌త‌కాలు వ‌చ్చాయి. ఈ సారి అంత‌కంటే ఒక‌టి త‌క్కువే వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Best Web Hosting Provider In India 2024



Source link