Sperm health: ఈ సీడ్ మిక్స్చర్ అబ్బాయిలు చెంచాడు తిన్నారంటే.. స్పర్మ్ కౌంట్, హెల్త్ సమస్యలకు చెక్

Best Web Hosting Provider In India 2024


పురుషుల్లో సంతానలేమి సమస్య ఆందోళన కలిగించే అంశంగా మారింది. యుక్త వయసు నుంచే అబ్బాయిలు ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం అవసరం. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తాయి. క్రమంగా శుక్రకణం నాణ్యత, సంఖ్య దెబ్బతింటుంది. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దీక్షా భావ్సర్ పురుషులు కొన్ని విత్తనాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుందని సూచిస్తున్నారు. ఇవి స్పెర్మ్ నాణ్యత మరియు సంతానోత్పత్తిని మెరుగుపరచడంతొ పాటూ, పూర్తి ఆరోగ్యానికి సహాయపడతాయి.

గుమ్మడి గింజలు:

ఈ విత్తనాలలో జింక్ ఉంటుంది. ఇది స్పెర్మ్ సంఖ్య పెంచడంలో, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వీర్యకణాల నాణ్యతను మెరుగుపరుస్తాయి. వీటిలో మెగ్నీషియం కూడా ఉంటుంది, ఇది బోలు ఎముకల వ్యాధి, ఎముకలో సులువుగా విరిగిపోకుండా సాయపడుతుంది.

అవిసె గింజలు:

అవిసె గింజల్లో ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ఎఎల్ఎ) ఉంటుంది. ఇది ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయులను పెంచుతుంది. అవిసె గింజలలో లిగ్నన్ కూడా ఉంటుంది. ఇది ప్రోస్టేట్ మరియు యుటిఐ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అవిసె గింజలకు వేడి స్వభావం ఉంటుంది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నిస్తున్న పురుషులు వీటికి దూరంగా ఉండాలి.

చియా గింజలు:

ఈ విత్తనాలను తినడం వల్ల పురుషుల గుండె ఆరోగ్యం, కండరాల నిర్మాణం, స్థిరమైన శక్తి మరియు హార్మోన్ల సమతుల్యతతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

నువ్వులు:

నువ్వుల్లో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి స్పెర్మ్ కదలికలు, పరిపక్వతకు ఆటంకం కలిగించే ఎంజైమ్లను నిరోధిస్తాయి. నువ్వుల్లో ఉండే లిగ్నన్లు స్పెర్మ్ నాణ్యత, జ్ఞాపకశక్తి, శృంగార సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఆయుర్వేదం ప్రకారం తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులు ఉత్తమమైనవి.

ఆవాలు:

వీటిలో విటమిన్ ఇ, జింక్, సెలీనియం ఉన్నాయి. ఇవి సంతానోత్పత్తిని పెంచడానికి, శుక్ర కణాలను రక్షించడానికి సహాయపడతాయి. ప్రోస్టేట్ ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఈ విత్తనాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రశాంతతను ప్రోత్సహిస్తాయి.

ఈ విత్తనాలను ఎలా తినాలి?

మీరు పైన చెప్పిన ఈ 5 రకాల విత్తనాలను సమాన పరిమాణంలో కలపవచ్చు. ప్రతిరోజూ అల్పాహారానికి ముందు లేదా సాయంత్రం ఆరోగ్యకరమైన చిరుతిండిగా 1 టేబుల్ స్పూన్ తినవచ్చు.

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024