Bollywood: అలాంటి దుస్తుల వల్ల షారుఖ్ సినిమాకు నో చెప్పా: బాలీవుడ్ నటి

Best Web Hosting Provider In India 2024


బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ సుమారు 30ఏళ్లుగా చాలా సినిమాలు చేస్తున్నారు. హీరోయిన్‍గా అనేక చిత్రాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో బలమైన సపోర్టింగ్ పాత్రలు చేశారు. కాగా, బాలీవుడ్ బాద్‍షా షారూఖ్ ఖాన్‍తో తాను ఓ సినిమాను తిరస్కరించానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవీనా టాండన్ వెల్లడించారు. అందుకు అభ్యంతరకరమైన దుస్తులే కారణమని చెప్పారు.

ఆ దుస్తులు ఇబ్బందిగా అనిపించాయి

ఆ సినిమా కోసం ధరించాలని చెప్పిన దుస్తులు చాలా అభ్యంతరకంగా తనకు అనిపించాయని, అందుకే సినిమాను తిరస్కరించానని రవీనా ఫిల్మ్‌ఫేర్ మ్యాగజీన్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఆ మూవీ పేరును మాత్రం చెప్పలేదు. “షారుఖ్ ఖాన్‍తో సినిమాకు దాదాపు సైన్ చేసే వరకు వచ్చింది. అయితే, కాస్ట్యూమ్స్ (దుస్తులు) విషయంలోనే ఇబ్బంది వచ్చింది. ఆ దుస్తులు చాలా తేడాగా అనిపించాయి. ఇవి కాస్త అభ్యంతరకరంగా ఉన్నాయనిపించింది. దీంతో సారీ, నేను చేయలేనని చెప్పేశా” అని రవీనా టాండన్ తెలిపారు.

పిచ్చిపట్టిందా అన్నారు

దుస్తులు నచ్చలేదని సినిమాను తిరస్కరించడంతో పిచ్చిపట్టిందా అని షారుఖ్ ఖాన్ తనతో అన్నారని రవీనా టాండన్ గుర్తు చేసుకున్నారు. అయితే, చాలా తేడాగా ఉన్నాయని తాను చెప్పానని తెలిపారు. “నీకు పిచ్చిపట్టిందా? అని ఎస్‍ఆర్‌కే (షారుఖ్) అన్నారు. ఇప్పుడెందుకు చెబుతున్నావని వారించారు. ఇద్దరం కలిసి జమానా దివాన మూవీ చేస్తున్నామని, ఇంకా కలిసి చేయాల్సి ఉందని సముదాయించారు. షారుఖ్ చాలా మంచి మనిషి. ఒకానొక బెస్ట్ కో-యాక్టర్. అలాంటి దుస్తులు నేను వేసుకోలేనని చెప్పేశా. నాకు తేడాగా ఉంటుందని తెగేసి చెప్పా” రవీనా టాండన్ వెల్లడించారు.

1995లో జమానా దివాన సినిమాలో షారుఖ్, రవీనా టాండన్ కలిసి నటించారు. మొత్తంగా నాలుగు సినిమాలు కలిసిచేశారు. అయితే, తాను ఓ మూవీ తిరస్కరించానని తాజాగా వెల్లడించారు. అయితే, ఈ మూవీ ఏదో వివరాలు చెప్పలేదు.

సల్మాన్‍తో రిలేషన్ గురించి..

1990ల్లో హీరో అక్షయ్ కుమార్‌తో రవీనా టాండన్ రిలేషన్‍షిప్ హాట్ టాపిక్‍గా నడిచింది. ఆ ఇద్దరు ప్రేమలో మునిగితేలారనే రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే, కొన్నాళ్లకు వీరు విడిపోయారు. ఆ తర్వాత కూడా స్నేహంగానే మెలిగారు. కాగా, ప్రస్తుతం తనకు, అక్షయ్‍కు మధ్య ప్రస్తుతం రిలేషన్ ఎలా ఉందో తాజాగా ఈ ఇంటర్వ్యూలో రవీనా తెలిపారు.

ప్రస్తుతం అందరం సంతోషంగా ఉన్నామని రవీనా టాండన్ చెప్పారు. “ప్రస్తుతం అందరం మంచిగా ఉన్నాం. మా జీవితాలతో సంతోషంగా ఉన్నాం. మా ఇద్దరికి పరస్పరం చాలా కాలంగా పరిచయం ఉంది. మంచి బంధం. అంతా బాగా, సంతోషంగా ఉన్నాం” అని రవీనా టాండన్ చెప్పారు. 2004లోనే ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తందానీని రవీనా వివాహం చేసుకున్నారు.

రవీనా లేటెస్ట్ సినిమా ఇదే

రవీనా టాండన్ లీడ్ లీడ్ రోల్ చేసిన ఘూడ్‍చాడీ సినిమా ఈ శుక్రవారమే (ఆగస్టు 9) జియోసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజ్ కాకుండానే ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్, పార్థ్ సమ్తాన్, ఖుశాలీ కుమార్ కూడా ప్రధాన పాత్రలు చేశారు. బినోయ్ కే గాంధీ దర్శకత్వం వహించారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024