Failure’s weekend: ఫెయిల్యూర్స్ వాళ్ల వీకెండ్ గడిపేది ఇలాగే.. సక్సెస్ అవ్వాలంటే ఇవీ తెలియాల్సిందే

Best Web Hosting Provider In India 2024


వారం మొత్తం పనిచేశాక చివర్లో వచ్చే ఆ రెండ్రోజుల వీక్‌ఆఫ్ కోసం ఎదురు చూడనివాళ్లుండరు. ఈ రెండ్రోజులను ఎలా గడుపుతున్నారనే విషయం బట్టి మీరు విజయవంతులా, కాదా అని చెప్పొచ్చు. విజయవంతులు వీకెండ్‌ను వారమంతా సాఫీగా సాగేలా చేసుకోడానికి వాడుకుంటారు. అదే దాన్ని సరిగ్గా వాడుకోకుండా, బద్ధకంగా గడిపేస్తే విజయం సాధించడం అసాధ్యం. అసలు ఫెయిల్యూర్స్ వాళ్ల వీకెండ్ ఎలా గడుపుతారో చూడండి.

 

పని నుంచి బయటకు రారు:

విజయవంతులెవరు వీకెండ్స్ కూడా పనిదినాల్లో పని చేసినట్లు చేయరు. ఆ రెండ్రోజులను మిగతా వారం పని ఎలా చేయాలో ఆలోచించడానికి కేటాయిస్తారు. ఫెయిల్యూర్ మాత్రం వీకెండ్స్ లోనూ పని ధ్యాసలోనే ఉంటాడు. దానిగురించే ఆందోళన పడుతూ సమయమంతా వృథా చేస్తారు.

 

షెడ్యూల్ ఉండదు:

విజయవంతులు వారం, నెల, సంవత్సరానికి కూడా షెడ్యూల్ ముందుగానే వేసుకుంటారు. ఫెయిల్యూర్ మాత్రం వచ్చే వారంలో ఏం చేయాలో కూడా ఆలోచించరు. వీకెండ్స్ మొత్తం ఖాళీగా గడిపేస్తారు. అలాగనీ వీకెండ్ ఇలాగే గడవాలని ఒక షెడ్యూల్ వేసుకొని గడపాల్సిన అవసరం లేదు. కనీసం చేయాలనుకున్న పనులు మాత్రం ముందుగానే కొన్నయినా నిర్ణయించుకోవాలి. ఆ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. దాంతో సమయం మిగులుతుంది. ఆనందంగానూ గడుపుతారు.

 

గ్యాడ్జెట్స్ వదిలిపెట్టరు:

విజయవంతులుగా మారాలంటే వీకెండ్స్ ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను దూరం పెట్టాల్సిందే. వాటికంటూ ఓ టైమ్ కేటాయించుకోవాలి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం దాకా అయినా ఫోన్లు, ఈ మెయిళ్లు చెక్ చేసుకోకుండా ఉండే నిర్ణయం తీసుకోవాలి. ఫెయిల్యూర్స్ మాత్రం వీకెండ్స్ కూడా అలా చేతిలో ఏదో ఒక గ్యాడ్జెట్ తో రోబోలా గడిపేస్తారు.

 

బద్దకంగా గడిపి బాధ పడతారు:

వీకెండ్ రోజు వారానికి సరిపడా సంతోషం కూడగట్టుకోవాలి. కానీ ఫెయిల్యూర్ వీకెండ్స్ అలా బద్ధకంగా ఉన్నచోటు నుంచి కదలకుండా గడిపేస్తారు. వీకెండ్ అయిపోయాక అనవసరంగా వృథా చేశామని బాధపడతారు. వాళ్లు ఆరోజుల్లో పూర్తి చేద్దాం అని వాయిదా వేసుకుంటూ వస్తున్న పనుల్ని పూర్తి చేయకుండానే మరో వీకెండ్ మొదలెట్టేస్తారు. అలా ఆ బాధ కొనసాగుతూనే ఉంటుంది.

 

చెడు అలవాట్లు:

స్నేహితులతో బయటకు వెళ్లడం మంచిదే. దాంతో అలిసిపోయి కాస్త విశ్రాంతి తీసుకున్నా కూడా మీ శరీరానికి కాస్త సమయం కేటాయించినట్లే. అలా కాకుండా దుర్వ్యసనాల వల్ల మత్తుతో తూలిపోయి నిద్ర పోకూడదు. మీకున్న వ్యసనాలతో వీకెండ్ గడిపేయకూడదు. నాణ్యమైన నిద్ర కూడా పట్టదు. కేవలం మత్తుగా ఉంటారంతే. దాంతో వీకెండ్ అంతా అలాగే కొనసాగించాల్సి వస్తుంది.

 

వృథా ఖర్చులు:

వారమంతా కష్టపడితే వచ్చే డబ్బుల్ని కేవలం ఆ రెండ్రోజుల్లో ఖర్చు పెట్టేస్తారు. అలాగనీ అవసరమైన వాటికోసం ఖర్చుపెట్టకూడదని కాదు. అనవసరమని తెలిసినా కూడా క్షణికానందం కోసం డబ్బు వృథా చేయకపోతే చాలు. ప్రతి వీకెండ్ తప్పకుండా ఏదో ఒకటి కొనాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ వృథా ఖర్చుల వల్ల ఎప్పటికీ ఫెయిల్యూర్ గానే మిగిలిపోతారు.

 

ఈ రెండ్రోజులు కూడా ఇష్టమైనట్లు ఉండకపోతే ఎలా అనిపించొచ్చు. కానీ మిగతా పని దినాల్లో మీకు ఒత్తిడి, డిప్రెషన్ రావొద్దంటే కొంత షెడ్యూల్ చేసుకోవడం తప్పనిసరి. దానివల్ల మీకు తెలీకుండానే ప్రతి రోజూ హాయిగా గడుస్తుంది.

 

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024