Black rice: “బ్లాక్‌రైస్”ను నరేంద్రమోదీ సూపర్ ఫుడ్ అని ఎందుకన్నారు? తెల్లన్నం తినడం మానేయొచ్చా ఇక

Best Web Hosting Provider In India 2024


నరేంద్రమోది తన ఉపన్యాసంలో అస్సాంకు చెందిన బ్లాక్ రైస్‌ను సూపర్ ఫుడ్ అని కొనియాడారు. ఈశాన్య భారతానికి చెందిని ఈ బియ్యం చూడ్డానికి నల్లగా, ఉడికాక పర్పుల్ రంగులో ఉంటుంది. ఈ బియ్యంలో ఉండే యాంతోసియానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్ వల్ల నలుపు రంగు వస్తుంది. బ్లాక్ బెర్రీ, ఎగ్ ప్లాంట్ ‌కు నలుపు రంగు రావడానికి కూడా ఇదే కారణం. ఇండియా, జపాన్, థాయ్‌ల్యాండ్, చైనా, ఇండోనేషియాల్లో కూడా ఈ బ్లాక్ రైస్ పండిస్తారు. మణిపూర్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో మనదగ్గర ఈ బ్లాక్ రైస్ పండిస్తున్నారు. ఈ బియ్యాన్ని సూపర్ ఫుడ్ ఎందుకనాలో తెల్సుకోండి.

 

పోషకాలు:

వంద గ్రాముల బ్లాక్ రైస్‌లో 79.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4.7 గ్రాముల పీచు, 11.6 గ్రాముల ప్రొటీన్, 1.67 మి.గ్రా ఐరన్ ఉంటుంది.

 

బ్లాక్ రైస్ లాభాలు:

1. పేగు ఆరోగ్యం:

ఈ బియ్యంలో పీచు శాతం ఎక్కువ. కాబట్టి జీర్ణ సంబంధిత, పేగు అనారోగ్యాలు రాకుండా చూస్తుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్య తగ్గుతుంది.

 

2. డయాబెటిస్:

2017లో బయాలాజికల్, ఫార్మాసుటికల్ బులెటిన్ ప్రకారం బ్లాక్ రైస్‌లో యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయని తేలింది. యాంతోసియానిన్స్ వల్ల ఈ బియ్యానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే రకరకాల వ్యాధులు తగ్గపోతాయి.టైప్ 2 డయాబెటిస్ కూడా రాకుండా నివారిస్తుంది.

 

3. డిటాక్స్:

దీంట్లో ఉండే ఎక్కువ శాతం యాంటీ ఆక్సిడెంట్ల వల్ల డిటాక్స్ చేసే లక్షణాలున్నాయి. కాలేయ పనితీరును ఇది మెరుగు పరుస్తుంది. శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు పంపిస్తుంది.

 

4. గుండె ఆరోగ్యం:

దీంట్లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యం బాగుంటుంది. క్రమంగా చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇవి శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి.

 

5. కంటి ఆరోగ్యం:

బ్లాక్ రైస్ లో ఉండే లూటిన్, లైకోపీన్, బీటా కెరోటిన్ వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. యూవీ కిరణాల నుంచి కంటిని రక్షిస్తాయి.

 

6. మెదడు పనితీరు:

ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మెదడులో కణాలు దెబ్బతినకుండా దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కాపాడతాయి. దాంతో మెదడులో నరాల సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. దీన్ని క్రమంగా తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

 

7. క్యాన్సర్:

2023లో నిర్వహించిన ఫుడ్ కెమిస్ట్రీ సర్వే ప్రకారం దీంట్లో బ్లాక్ రైస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తో పోరాడి క్యాన్సర్ అవకాశాల్ని తగ్గిస్తుంది. కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

 

8. బరువు తగ్గడంలో:

దీంట్లో ఉండే పీచు శాతం వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. దాంతో ఎక్కువ కేలరీలు తీసుకోలేము. కావాల్సిన పోషకాలూ దీంతో అందుతాయి. క్రమంగా బరువూ తగ్గుతారు.

 

వైట్ రైస్ కన్నా బ్లాక్ రైస్ మంచిదా?

బ్లాక్ రైస్‌లో ఉండే పీచు, యాంటి ఆక్సిడెంట్ల వల్ల వైట్ రైస్ కు ఇది మంచి ప్రత్యామ్నాయం. బ్లాక్ రైస్ పీచు, మినరళ్లు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. దీంట్లో ఉండే యాంతోసియానిన్లు కూడా శరీరానికి మేలు చేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండానూ బ్లాక్ రైస్ సాయపడుతుంది. పీచు శాతం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఇన్ని పోషకాలు ఉండటం వల్ల వైట్ రైస్ కన్నా బ్లాక్ రైస్ మేలు ఎక్కువే అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే మంచిది కదానీ ఏదీ ఎక్కువ తిన్నా కార్బోహైడ్రేట్లు చేరిపోతాయి. కాబట్టి మితంగా తినాలి.

 

ఎంత తినొచ్చు?

రోజూ సగం కప్పు అంటే 90 నుంచి 100 గ్రాముల దాకా ఉడికించిన బ్లాక్ రైస్ తినొచ్చు. దీంతో కావాల్సిన కేలరీలు, పోషకాలు సరిగ్గా అందుతాయి.

 

 

 

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024