Long weekend: వరసగా 5 రోజులు సెలవులు.. ఈ వర్షాకాలం డెస్టినేషన్లకు ట్రిప్ ప్లాన్ చేసేయండి

Best Web Hosting Provider In India 2024


ప్రయాణాలను ఇష్టపడే వ్యక్తులు సుదీర్ఘ సెలవుల కోసం ఎదురు చూస్తారు. ఆగస్టు 15, వీకెండ్స్ రెండ్రోజులు, రక్షాబంధన్ కలిపి ప్లాన్ చేసుకుంటే వచ్చే వారంలో 5 రోజుల సెలవులు వస్తాయి. ఈ లాంగ్ వీకెండ్‌లో ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే కొన్ని మంచి ప్రదేశాలు చూడండి.

సిక్కిం:

సిక్కిం దాని సహజ సౌందర్యం, గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందింది. పురాతన సరస్సులు, జలపాతాలు, వేడి నీటి బుగ్గలు, ఎత్తైన శిఖరాలు.. ఇలా సిక్కింలో సందర్శించవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఆగష్టు 15 – రాఖీ సెలవుల్లో అయిదు రోజులు ఈ అందమైన ప్రదేశానికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సమయం సరిపోతుంది.

గోవా:

వర్షాకాలంలో గోవా ఏంటీ అనుకోకండి. వర్షాల్లో గోవా బీచ్‌లలో నడవటం గొప్ప అనుభూతినిస్తుంది. ఈ రోడ్లలో వర్షంలో తడుస్తూ మీ భాగస్వామితో చేసే ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ నాలుగైదు రోజుల సమయం గోవాలోనే వెచ్చించడానికి బెస్ట్.

పంచగని:

పంచగని ముంబయి, పూణే ప్రజలకు ప్రసిద్ధ వారాంతపు ప్రదేశం. ఇది భారతదేశంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి. పంచగని చుట్టూ ఐదు పచ్చని కొండలు ఉన్నాయి. ఈ హిల్ స్టేషన్ యొక్క సహజ సౌందర్యం మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదించాల్సిందే.

ఊటీ:

ఊటీ దక్షిణ భారతదేశంలోని ఒక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా ఉంటాయి. పచ్చని అడవులు, అందమైన ఉద్యానవనాలు, చుట్టూ పెద్ద పెద్ద ఆనకట్టలు, కొండల్లో మెరిసిపోయే సరస్సులు మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

గ్యాంగ్‌టక్:

గ్యాంగ్ టక్ సిక్కిం రాష్ట్రంలో అతిపెద్ద నగరం. ఈ ప్రదేశం హిమాలయ పర్వత శ్రేణిలోని శివాలిక్ కొండల మీద 1437 మీటర్ల ఎత్తులో ఉంది. త్సోమో లేక్, బాన్ ఝక్రీ, తాషి వ్యూ పాయింట్.. వంటి ప్రదేశాలను తప్పక సందర్శించాలి.

పాండిచ్చేరి:

ఈ ప్రదేశం పర్యాటక ఆకర్షణలలో భారతీయ, ఫ్రెంచ్ సాంప్రదాయ కలగలిసిన అందమైన ప్రదేశం. మనోహరమైన వీధులు, సహజమైన బీచ్‌లు, కాలనీల వరకు.. ఇక్కడ చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. మీరు పాండిచ్చేరిలో అందమైన ప్రదేశాలు చూడ్డానికి కాలినడకన వీధుల్లో తిరిగితే మంచి అనుభూతి.

మౌంట్ అబూ:

రాజస్థాన్ లోని ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్ మౌంట్ అబూ. ఈ నెలలో ఇక్కడికి వెళ్లడం చాలా సరదాగా ఉంటుంది. ఆరావళి కొండల్లో ఎత్తైన శిఖరంపై ఉన్న ఈ హిల్ స్టేషన్ అందం, వాతావరణం అందరినీ ఆకర్షిస్తుంది.

మహాబలేశ్వర్:

మహారాష్ట్రలోని అందమైన హిల్ స్టేషన్ మహాబలేశ్వర్. భాగస్వామితో రొమాంటిక్ వెకేషన్ కు ఈ ప్రదేశం ఉత్తమంగా ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడి ప్రకృతి అందానలు ఒక్కసారన్నా చూడాల్సిందే. విల్సన్ పాయింట్, ప్రతాప్ గఢ్ కోట మొదలైన వాటిని కూడా సందర్శించవచ్చు.

కొడైకెనాల్:

ఇప్పుడు సందర్శించడానికి కొడైకెనాల్ ఉత్తమ ప్రదేశం. ముఖ్యంగా బెంగళూరు, దక్షిణాదిలోని ఇతర నగరాల్లో నివసించే వారికి. ఆగస్టులో వర్షాకాలంలో ఇక్కడ తిరగడం అంటే విపరీతమైన ఆనందం ఉంటుంది.

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024