Pyramids collapse : కూలిపోతున్న పిరమిడ్లు- వినాశనం తప్పదా? అసలు కారణం ఏంటి?

Best Web Hosting Provider In India 2024


పురాతన పిరమిడ్లు కుప్పకూలుతున్న వార్తలు మెక్సికో ప్రజలను భయపెడుతున్నాయి. పురెపెచా తెగకు సంబంధించిన పూర్వికులు నిర్మించిన రెండు పిరమిడ్లు ఇటీవలే కూలిపోయాయి. వినాశనం తప్పదని ఆ తెగ ప్రజలు హెచ్చరిస్తున్నారు!

కూలుతున్న పిరమిడ్లు.. వినాశనం తప్పదా?

ది సన్ ప్రకారం.. పురాతన పురేపెచా తెగ వారి ప్రధాన దేవత కురిక్వేరికి మానవ బలిదానాలను అంకితం చేసేందుకు నిర్మించిన యాకాటా పిరమిడ్లలో రెండు కూలిపోయాయి. ఈ పిరమిడ్లు మిచోకాన్​లోని ఇహువాట్జియో పురావస్తు ప్రదేశంలో ఉన్నాయి.

పాక్షికంగా కూలిపోయిన రెండు పిరమిడ్లకు సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

ఆ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం వరకు భారీ వర్షాలు కురిశాయి. తుపాను కారణంగా ఒక పిరమిడ్​ కూలిపోయింది. తమ స్థానిక సంప్రదాయాల ప్రకారం రాబోయే వినాశనాన్ని ఇది సూచిస్తుందని ఈ తెగకు చెందిన తారియాకురి అల్వారెజ్ ది సన్​కు తెలిపారు.

ఇదీ చూడండి:- Stampede at temple : ఆలయంలో తొక్కిసలాట- ఏడుగురు దుర్మరణం!

“కాంక్విస్టాడర్ల రాకకు ముందు, ఇలాంటిదే జరిగింది. ఆ కాలపు పురెపెచా ప్రపంచ దృక్పథానికి నానా కుయెర్హేపిరి, కేరీ కురిక్వేరి దేవతలు అసంతృప్తి చెందారు,” అని ఆయన అన్నారు.

ఇహువాట్జియో పురావస్తు ప్రాంతం క్రీ.శ 900 నుంచి స్పానిష్ ఆక్రమణదారుల రాక వరకు మొదట అజ్టెక్లు, తరువాత ప్యూర్పెచాలు ఆక్రమించుకున్నారు.

మెక్సికన్ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ (ఐఎన్ఎహెచ్) గత బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. “మంగళవారం రాత్రి ఇహువాట్జియో ఆర్కియాలజికల్ జోన్​లోని పిరమిడ్ స్థావరాల్లో ఒకటైన దక్షిణ ముఖద్వారం మధ్య భాగంలో కూలిపోయింది. పాట్జ్కువారో సరస్సు పరీవాహక ప్రాంతంలో భారీ వర్షపాతం కారణంగా ఇది సంభవించింది,” అని ప్రకటన పేర్కొంది.

నష్టాన్ని అంచనా వేసేందుకు జులై 30 తెల్లవారుజామున హెరిటేజ్​ సైట్​కు సిబ్బందిని పంపినట్టు అధికారులు చెప్పారు.

“ఆ కాలంలో వాడిన మెటీరియల్స్​ ఇప్పుడు లేవు. ప్రస్తుత టెక్నాలజీ, మెటీరియల్స్​ కాకుండా, గతంలో జరిగిన పనులు, మరమ్మత్తులు ఇప్పుడు ప్రతికూలంగా మారాయి. ప్రీ- కొలంబియన్​ స్ట్రక్చర్​కి నష్టం కలిగిస్తోంది,” అని అధికారులు స్పష్టం చేశారు.

“ఈ ప్రాంతంలో గతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత కరవు వచ్చింది. ఫలితంగా పిరమిడ్లకు పగుళ్లు వచ్చాయి. వర్షం పడటంతో పిరమిడ్ల లోపలికి నీరు చేరుకుంది,” అని అధికారులు వివరించారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link