Kanguva trailer: స్టన్నింగ్ విజువల్స్.. అదిరిపోయిన యాక్షన్.. కంగువ ట్రైలర్ వచ్చేసింది.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సీన్లతో..

Best Web Hosting Provider In India 2024


Kanguva trailer: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ కంగువ ట్రైలర్ వచ్చేసింది. శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తుండగా.. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ ఫిమేల్ లీడ్ గా కనిపించనుంది. స్టన్నింగ్ విజువల్స్, యాక్షన్, మ్యూజిక్ తో ఈ కంగువ ట్రైలర్ ఊహించినట్లే సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

కంగువ ట్రైలర్

సూర్య నటిస్తున్న కంగువ మూవీ తమిళ ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్స్, టీజర్ లాంటివి సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా రిలీజైన ట్రైలర్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అన్న ఆతృతను పెంచేలా ఉంది. సోమవారం (ఆగస్ట్ 12) ఈ రిలీజ్ కాగా.. సూర్య తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు.

డైరెక్టర్ శివ బర్త్ డే సందర్భంగా ఈ ట్రైలర్ తీసుకొచ్చారు. “ఓ టీమ్ గా మనమందరం కలిసి సాధించినదానికి చాలా గర్వంగా ఉంది. థ్యాంక్యూ. డియరెస్ట్ శివ.. వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే. మీ అందరి కోసం కంగువ ట్రైలర్” అనే క్యాప్షన్ తో సూర్య ఈ ట్రైలర్ రిలీజ్ చేశాడు. 2 నిమిషాల 37 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ మొత్తం అద్భుతమైన విజువల్స్.. సూర్య, బాబీ డియోల్ యాక్షన్ తో నిండిపోయింది.

యానిమల్ మూవీలో క్రూరమైన విలన్ గా కనిపించిన బాబీ డియోల్.. ఈ కంగువతో మరోసారి అంతకంటే క్రూరమైన పాత్రలో రాబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ దీవిలో ఎన్నో మనకు తెలియని రహస్యాలు ఉన్నాయి.. కానీ అన్నింటి కంటే మించిన రహస్యం ఇదీ అని ఓ వృద్ధురాలు చెప్పే డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. రెండు తెగల మధ్య జరిగే పోరాటంగా ఈ ట్రైలర్ సాగింది. ఓ తెగకు సూర్య, మరో తెగకు బాబీ డియోల్ నాయకత్వం వహించినట్లుగా చూపించారు. సూర్య ఎంట్రీ సీనే గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

ఆ రెండు సినిమాల సీన్లు..

అయితే కంగువ ట్రైలర్ లో రెండు సీన్లు ఆసక్తి రేపాయి. వాటిని రాజమౌళి తీసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది తీసినట్లుగా అనిపిస్తోంది. ఇక ట్రైలర్ లో మరో హైలైట్ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. తెరపై సూర్య, బాబీ వైరానికి తగినట్లుగా ఎంతో గంభీరమైన మ్యూజిక్ తో డీఎస్పీ అలరించాడు. కంగువ మూవీ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో జగపతి బాబు, యోగి బాబు, రెడిన్ కింగ్స్‌లీ, కేఎస్ రవికుమార్, కోవై సరళలాంటి వాళ్లు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ లతోపాటు పలు ఇతర విదేశీ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024