Garlic Jeera rice: వేయించిన వెల్లుల్లితో ఇలా జీరా రైస్ చేయండి, టేస్ట్ అదిరిపోతుంది, పైగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది

Best Web Hosting Provider In India 2024


Garlic Jeera rice: వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీనితో వంటకాలు చేసేవారి సంఖ్య తక్కువే. ఇక్కడ మేము గార్లిక్ జీరా రైస్ రెసిపీ ఇచ్చాము .ఇందులో ఈ రెసిపీ లో వెల్లుల్లి వేయించిన తర్వాత వినియోగిస్తాము. దీనివల్ల ఈ రెసిపీకి మంచి స్మోక్ స్మెల్ కూడా వస్తుంది. ఒకసారి మీరు దీన్ని ప్రయత్నించి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ గార్లిక్ జీరా రైస్‌ను ఎలాంటి కూర అవసరం లేకుండానే తినవచ్చు. లేదా పక్కన మంచి చికెన్ కూర లేదా ఎగ్ కర్రీ జోడీగా తింటే రుచి ఇంకా అదిరిపోతుంది. బాస్మతి బియ్యంతో ఈ రెసిపీని వండితే టేస్టీగా ఉంటుంద.

గార్లిక్ జీరా రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు

బాస్మతి బియ్యం – ఒక కప్పు

ఉప్పు – రుచికి సరిపడా

దాల్చిన చెక్క – చిన్న ముక్క

జీలకర్ర – ఒక స్పూను

వెల్లుల్లి రెబ్బలు – ఆరు

కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

మిరియాల పొడి – అర స్పూను

ఉప్పు – రుచికి సరిపడా

పచ్చిమిర్చి – రెండు

నెయ్యి – ఒక స్పూను

ఎండు మిర్చి – రెండు

నూనె – ఒక స్పూను

గార్లిక్ జీరా రైస్ రెసిపీ

1. గార్లిక్ జీరా రైస్ చేసేందుకు బాస్మతి బియ్యం ఉత్తమ ఎంపిక. ఇది పొడిపొడిగా చాలా టేస్టీగా వస్తుంది.

2. ఈ బియ్యాన్ని కడిగి 20 నిమిషాల పాటు ముందే నానబెట్టుకోవాలి.

3. ఆ తర్వాత ఈ బియ్యాన్ని ఒక గిన్నెలో వేసి ఉడకడానికి సరిపడా నీటిని వేసి 90 శాతం వరకు ఉడికించుకోవాలి.

4. తర్వాత వడకట్టి ఒక ప్లేట్లో పొడిపొడిగా ఆరబెట్టుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

6. ఒక స్పూన్ నెయ్యి, నూనె కూడా వేయాలి.

7. నూనెలో దాల్చిన చెక్క, జీలకర్ర వేసి వేయించుకోవాలి.

8. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిని కూడా వేసి బాగా వేయించుకోవాలి.

9. వెల్లుల్లి కాస్త రంగు మారేవరకు ఉంచాలి.

10. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగును వేసి వేయించాలి.

11. అలాగే ఎండుమిర్చి, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి.

12. ముందుగా వండి పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి.

13. పైన కొత్తిమీర తరుగును చల్లాలి.

14. అన్నాన్ని పులిహోర లాగా కలుపుకుంటే టేస్టీ గార్లిక్ జీరా రైస్ రెడీ అయిపోతుంది.

15. దీన్ని ఎగ్ కర్రీతో లేదా పన్నీర్ కర్రీతో, చికెన్ కర్రీతో ఎలా తిన్నా టేస్టీగా ఉంటుంది.

16. అలాగే చోలే మసాలా, దాల్ తడ్కా వంటివి కూడా దీనికి మంచి కాంబినేషన్ అని చెప్పుకోవాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం.

ఈ గార్లిక్ జీరా రైస్‌లో మీకు కావాలనుకుంటే వెల్లుల్లిని కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. వెల్లుల్లి వాసన తినాలన్న కోరికను పెంచుతుంది. దీనిలో మనం వాడినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా ఉపయోగపడుతుంది. రాత్రిపూట సింపుల్‌గా భోజనం ముగించాలనుకుంటే గార్లిక్ జీరా రైస్‌ను ప్రయత్నించండి. స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది.ఈ గార్లిక్ జీరా రైస్‌ను ఎగ్ కర్రీతో తింటే రుచి అదిరిపోతుంది. అలాగే పనీర్ గ్రేవీతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.

Source / Credits

Best Web Hosting Provider In India 2024