Best Web Hosting Provider In India 2024
మాస్ మహారాజ్ రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రం రిలీజ్‍కు రెడీ అయింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇటీవల వచ్చిన ట్రైలర్ అదిరిపోవడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. మిస్టర్ బచ్చన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (ఆగస్టు 12) కర్నూలులో జరిగింది.
భాగ్యశ్రీ మాస్ డ్యాన్స్
మిస్టర్ బచ్చన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో స్టేజ్‍పైనే మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టారు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఈ మూవీలోని రెప్పల్ డప్పుల్ అనే మాస్ పాటకు ఫుల్ గ్రేస్‍తో స్టెప్స్ వేశారు. ఆరెంజ్ చీరకట్టులో స్వాగ్‍తో డ్యాన్స్ చేశారు. భాగ్యశ్రీ డ్యాన్స్ చేయడంతో ప్రేక్షకులు కేకలు, ఈలలతో మోతెక్కించారు. ఈ ఔడ్‍డోర్ ఈవెంట్ మోతెక్కిపోయింది. ఈ చిత్రంతోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీకి ఇప్పటికే చాలా పాపులారిటీ వచ్చేసింది.
భాగ్యశ్రీ బోర్సే మాస్ డ్యాన్స్ చేసిన ఈ వీడియో కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చక్కర్లు కొడుతున్నాయి. స్టేజ్‍పై భాగ్యశ్రీ ఆ రేంజ్‍లో డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మరో మాస్ సాంగ్ రిలీజ్
మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి నాలుగో పాట కూడా నేడు రిలీజ్ అయింది. నల్లంచు తెల్లచీర అంటూ మాస్ బీట్‍తో ఈ సాంగ్ ఉంది. ఈ సాంగ్‍కు మంచి ఊపున్న ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. ఈ పాటను శ్రీరామచంద్ర, సమీర భరద్వాజ్ ఆలపించారు. భాస్కర భట్ల లిరిక్స్ అందించారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో స్టేజ్‍పై నల్లంచు తెల్లచీర పాటకు కూడా స్టెప్స్ వేశారు భాగ్యశ్రీ బోర్సే.
మిస్టర్ బచ్చన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో మాస్ మహారాజ రవితేజ స్టైలిష్ లుక్‍తో అదరగొట్టారు. బ్లాక్, వైట్ వైట్ కలర్స్ ఔట్‍ఫిట్‍లో ట్రెండీగా కనిపించారు. డైరెక్టర్ హరీశ్ శంకర్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సహా మూవీ యూనిట్ సభ్యులు ఈ ఈవెంట్‍కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‍కు ప్రేక్షకులు కూడా భారీ సంఖ్యలో వచ్చారు.
మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ, భాగ్యశ్రీ జోడీగా నటించగా.. జగపతి బాబు విలన్‍గా చేశారు. 1980ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ సాగుతుంది. ఈ సినిమాలో ఇన్‍కమ్ ట్యాక్స్ అధికారి పాత్ర చేశారు రవితేజ. ఓ బడా పారిశ్రామిక వేత్తపై ఐడీ దాడి చుట్టూ ఈ మూవీ సాగుతుంది. బాలీవుడ్ మూవీ రైడ్‍కు రీమేక్‍గా ఈ చిత్రం వస్తోంది. అయితే, తెలుగు తగ్గట్టుగా మిస్టర్ బచ్చన్ సినిమాలో చాలా మార్పులు చేశారు హరీశ్ శంకర్. తన మార్క్ చిత్రంగా అన్ని కమర్షియల్ హంగులతో తీర్చిదిద్దారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
మిస్టర్ బచ్చన్ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే, అందుకు ముందే ఆగస్టు 14న ప్రీమియర్ షోలు ఉండనున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్లకు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా షురూ అయ్యాయి. ఈ చిత్రానికి పోటీగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ఆగస్టు 15వ తేదీనే వస్తోంది. దీంతో ఈ బాక్సాఫీస్ క్లాష్ ఇంట్రెస్టింగ్‍గా మారింది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits