Best Web Hosting Provider In India 2024
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్‌కు మేకర్స్ శుభం కార్డు వేశారు. అర్థాంతరంగా ఈ సీరియల్‌ను ముగించారు. ఆగస్ట్ 11 నాటితో ఈ సీరియల్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని సీరియల్‌లో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు సాయికిరణ్ అలియాస్ మహేంద్ర భూషణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. గుప్పెడంత మనసు సీరియల్‌కు ప్యాకప్ చెప్పినట్లు పేర్కొన్నాడు.
ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్…
మెమోరబుల్ డే ఆగస్ట్ 11 2024 అని రాసి ఉన్న ఓ షీల్డ్‌ను సాయికిరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ షీల్డ్‌పై గుప్పెడంత మనసు సీరియల్ ఫొటో ఉంది. అందులో రిషి, వసుధారలు కనిపిస్తున్నారు. ఆగస్ట్ 17న ఈ సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ అని ప్రచారం జరుగుతోంది. అంటే మరో నాలుగు రోజుల్లో గుప్పెడంత మనసు సీరియల్ ఎండ్ కార్డు పడనున్నట్లు తెలుస్తోంది.
రిషి…వసుధారలను మిస్సవుతున్నాం…
గుప్పెడంత మనసు సీరియల్ ముగియబోతుందని తెలియగానే ఫ్యాన్స్ డిసపాయింట్ అయ్యారు. రిషిధారలను మిస్సవుతామంటూ సాయికిరణ్ పోస్ట్‌పై కామెంట్స్ చేస్తోన్నారు. మంచి సీరియల్ ఆగిపోతుండటం బాధను కలిగిస్తుందని ఓ సీరియల్ అభిమాని పేర్కొన్నాడు.
మరికొన్నాళ్లు ఈ సీరియల్ టెలికాస్ట్ అయితే బాగుండేదని మరో అభిమాని కామెంట్ చేయగా…రిషి వసుధారలతో పాటు ఇదే నటీనటుల కాంబినేషన్ ఇంకో సీరియల్ వస్తే బాగుంటుందని ఓ సీరియల్ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. సాయికిరణ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రిషి రీఎంట్రీ…
కొన్నాళ్ల క్రితమే గుప్పెడంత మనసు సీరియల్‌లోకి ముఖేష్ గౌడ అలియాస్ రిషి రీఎంట్రీ ఇచ్చాడు. రంగాగా కొత్త పాత్రలో కనిపించి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు. ఓ ప్రమాదం కారణంగా దాదాపు ఏడాది పాటు ఎడెనిమిది నెలల పాటు సీరియల్‌కు రిషి దూరమయ్యాడు. అతడు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కథ ఇంట్రెస్టింగ్‌గా మారుతుందని, టీఆర్‌పీ రేటింగ్ పెరుగుతుందని ఫ్యాన్స్ భావించారు.
అయితే డ్రామా అనుకున్నంతగా పండకపోవడం, ఒకే పాయింట్ చుట్టూ ఏళ్లకు ఏళ్లు సాగదీస్తుండటంతో విమర్శలు పెరిగిపోయాయి. కథను ముందుకు సాగించేందుకు దారులు క నిపించకపోవడంతో సీరియల్‌ను ఎండ్ చేయడమే మంచిదని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
శైలేంద్ర కుట్రలు బయటపడటమే కాకుండా రిషి తిరిగి కాలేజీకి ఎండీ అయినట్లుగా చూపిస్తూ భూషణ్ ఫ్యామిలీ ఒక్కటయ్యేలా చేసి సీరియల్‌ను ముగించబోతున్నట్లు తెలుస్తోంది.
1150 ఎపిసోడ్స్…
2020 డిసెంబర్‌లో గుప్పెడంత మనసు సీరియల్ ప్రారంభమైంది. ఇప్పటివరకు 1150కిపైగా ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. ఇందులో రిషిగా ముఖేష్ గౌడ నటించగా…వసుధార పాత్రను రక్షా గౌడ పోషించింది. వీరిద్దరు తమ కెమిస్ట్రీతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆరంభంలో టీఆర్‌పీ పరంగా టాప్‌లో ఉన్న ఈ సీరియల్ క్రమక్రమంగా ఆదరణను కోల్పోయింది. సాయికిరణ్, జ్యోతిరాయ్ కీలక పాత్రల్లో నటించారు. గుప్పెడంత మనసు ప్లేస్‌లో మరో కొత్త సీరియల్‌ను స్టార్ మా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం.
Best Web Hosting Provider In India 2024
Source / Credits