Best Web Hosting Provider In India 2024
Crime Thriller OTT: ట్వెల్త్ ఫెయిల్ మూవీలో అసమాన నటనతో విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్నాడు విక్రాంత్ మస్సే. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ పాత్రలో జీవించాడు. ట్వెల్త్ క్లాస్‌లో ఫెయిల్ అయిన మనోజ్ కుమార్ శర్మ చివరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్ని ఎలా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడన్నది స్ఫూర్తిదాయకంగా దర్శకుడు విధు వినోద్ చోప్రా ట్వెల్త్ ఫెయిల్ మూవీలో ఆవిష్కరించారు.
20 కోట్ల బడ్జెట్…70 కోట్ల కలెక్షన్స్…
కేవలం 20కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిన్న సినిమా 70 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఓటీటీలో చాలా వారాల పాటు ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.
క్రైమ్ థ్రిల్లర్ మూవీ…
ట్వెల్త్ ఫెయిల్ తర్వాత విక్రాంత్ మస్సే హీరోగా బాలీవుడ్లో బిజీగా మారాడు. ఈ ఏడాది ఎనిమిది నెలల గ్యాప్‌లోనే విక్రాంత్ మస్సే హీరోగా నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. త్వరలోనే ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో నేరుగా ఓటీటీ ఆడియెన్స్‌ను విక్రాంత్ మస్సే పలకరించబోతున్నాడు. సెక్టార్ 36 పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ సెప్టెంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది నెట్‌ఫ్లిక్స్. ఈ పోస్టర్లో విక్రాంత్ మాస్సే డ్యూయల్ షేడ్ క్యారెక్టర్లో కనిపిస్తోన్నాడు.
పోలీస్ ఆఫీసర్‌గా…
సెక్టార్ 36 మూవీకి ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహిస్తోన్నాడు. స్లమ్ ఏరియాలో చిన్న పిల్లల అదృశ్యం వెనకున్న మిస్టరీ ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా విక్రాంత్ మస్సే కనిపించబోతున్నాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఊహలకు అందని ట్విస్ట్‌లతో థ్రిల్లింగ్‌గా ఈ మూవీ సాగుతుందని మేకర్స్ చెబుతోన్నారు.
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో విక్రాంత్ మస్సేతో పాటు దీపక్ డోబ్రియల్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సొసైటీలో ఉన్న సామాజిక అసమానతలు, అధికారం, డబ్బు ప్రభావం ఎలా ఉంటుందున్నది రియలిస్టిక్‌గా సెక్టార్ 36లో మేకర్స్ చూపించబోతున్నట్లు తెలిసింది.
యథార్ఘ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. సెక్టార్ 36 హిందీతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది.త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నారు.
థ్రిల్లర్ సినిమాలు…
ప్రస్తుతం విక్రాంత్ మస్సే నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ది సబర్మతీ రిపోర్ట్, యార్ జిగ్రీ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా థ్రిల్లర్ కథాంశంతోనే తెరకెక్కుతోండటం గమనార్హం. మరో మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.
సీరియల్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభం…
సీరియల్ ఆర్టిస్ట్‌గా విక్రాంత్ మస్సే కెరీర్ ఆరంభమైంది. బాలికావధు, ధరమ్ వీర్‌తో పాటు పలు హిందీ సీరియల్స్‌లో లీడ్ యాక్టర్‌గా కనిపించాడు. మీర్జాపూర్, మెడ్ ఇన్ హెవెన్‌తో పాటు హిందీలో కొన్ని వెబ్‌సిరీస్‌లు చేశాడు. 2013లో రిలీజైన లూటేరాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీఇచ్చాడు విక్రాంత్ మస్సే. ట్వెల్త్ ఫెయిల్తోనే నటుడిగా అతడికి పెద్ద బ్రేక్ వచ్చింది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits