Mr Bachchan: రికార్డ్ స్థాయిలో ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ – బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Best Web Hosting Provider In India 2024


Mr Bachchan: మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీతో ఆగ‌స్ట్ 15న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు ర‌వితేజ‌. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీకి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. షాక్‌, మిర‌ప‌కాయ్ త‌ర్వాత ర‌వితేజ‌, డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తెర‌కెక్కుతోంది.

హ్యాట్రిక్ ఫ్లాపులు…

మిస్ట‌ర్ బ‌చ్చన్ కంటే ముందు ర‌వితేజ బ్యాక్ టూ బ్యాక్ మూడు ఫ్లాపుల‌ను ఎదుర్కొన్నాడు. అత‌డు హీరోగా న‌టించిన రావ‌ణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు, ఈగ‌ల్ మూవీ డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. ఈ సినిమాల రిజ‌ల్ట్‌ల‌తో సంబంధం లేకుండా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జ‌రిగింది. 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ యాక్ష‌న్ మూవీ రిలీజ్ అవుతోంది.

31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌…

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ థియేట్రిక‌ల్ బిజినెస్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 31 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. నైజాం, ఆంధ్రా ఏరియా హ‌క్కులు భారీ ధ‌ర ప‌లికిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. రెండు ఏరియాల్లో క‌లిపి థియేట్రిక‌ల్ రైట్స్ దాదాపు 23 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. సీడెడ్ నాలుగు కోట్ల వ‌ర‌కు ర‌వితేజ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు తెలిసింది.

ఓవ‌ర్‌సీస్‌లో రెండు కోట్లు, క‌ర్నాట‌క‌, రాయ‌చూర్‌తో పాటు మిగిలిన ప్రాంతాల్లో క‌లిపి మ‌రో రెండు కోట్ల వ‌ర‌కు ఈ సినిమా ప్రీ రిలీజ్ చేసిన‌ట్లు చెబుతోన్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 27 కోట్ల‌కు థియేట్రిక‌ల్ రైట్స్ అమ్ముడుపోగా…వ‌ర‌ల్డ్ వైడ్‌గా 31 కోట్ల వ‌ర‌కు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. థియేట‌ర్ల ద్వారా 32 కోట్లు వ‌స్తే నిర్మాత‌లు లాభాల్లోకి అడుగుపెడ‌తార‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ…

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీకి పోటీగా ఆగ‌స్ట్ 15న రామ్ పోతినేని డ‌బుల్ ఇస్మార్ట్‌తో పాటు ఎన్టీఆర్ బావ‌మ‌ర‌ది నార్నే నితిన్ ఆయ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు విక్ర‌మ్ డ‌బ్బింగ్ మూవీ తాంగ‌లాన్ అదే రోజు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ పోటీ నెల‌కొన‌డంతో ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ బ్రేక్ ఈవెన్‌ను సాధిస్తుందా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌…

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీలో ర‌వితేజ‌కు జోడీగా భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. ఈ మూవీతోనే భాగ్య‌శ్రీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్‌లో త‌న గ్లామ‌ర్‌తో అభిమానుల మ‌న‌సుల్ని దోచేస్తుంది ఈ బ్యూటీ. ఆమె గ్లామ‌ర్ అట్రాక్ష‌న్ కూడా మూవీకి ప్ల‌స్ అవుతోంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, స‌చిన్ ఖేడ్క‌ర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

రైడ్ రీమేక్‌…

అజ‌య్ దేవ్‌గ‌ణ్ హీరోగా న‌టించిన బాలీవుడ్ మూవీ రైడ్‌కు రీమేక్‌గా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తెర‌కెక్కుతోంది. రైడ్ మూవీ 2018లో బాలీవుడ్‌లో రిలీజైంది. కేవ‌లం 40కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన రైడ్ 150 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అజ‌య్ దేవ్‌గ‌ణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. ఓ రాజ‌కీయ‌నాకుడిగా ఐటీ అధికారులు జ‌రిపే దాడుల నేప‌థ్యంలో ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024