Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్‍‍తో దుమ్మురేపిన నాని.. ఎలివేషన్స్ అదుర్స్

Best Web Hosting Provider In India 2024


నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో బంపర్ హిట్‍లు కొట్టి నాని జోష్‍లో ఉన్నారు. విభిన్నమైన కథలతో చిత్రాలు చేస్తూ అదరగొడుతున్నారు. సరిపోదా శనివారం చిత్రం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫుల్ హైప్ ఉంది. ఈ తరుణంలో సరిపోదా శనివారం నుంచి నేడు (ఆగస్టు 13) ట్రైలర్ రిలీజ్ అయింది.

సరిపోదా శనివారం ట్రైలర్ యాక్షన్, ఎలివేషన్లతో అదిరిపోయింది. యాక్షన్ మోడ్‍లో నాని దుమ్మురేపారు. యాక్షన్‍లోనూ ఏ మాత్రం తగ్గననేలా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. దౌర్జన్యాలు చేసే పోలీస్ అధికారిగా ఎస్‍జే సూర్య తన మార్క్ యాక్టింగ్‍తో మెప్పించారు. జేక్స్ బెజోయ్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ గూజ్‍బంప్స్ తెప్పించేలా ఉంది. మొత్తంగా అంచనాలకు తగ్గట్టే సరిపోదా శనివారం ట్రైలర్ ఉంది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024