Best Web Hosting Provider In India 2024
AP Fisheries BFSC Courses : ఆంధ్రప్రదేశ్‌లోని ఫిషరీస్ యూనివర్సిటీ (విజయవాడ)లో 2024-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు గడువు పొడిగించారు. తాజా ఉత్తర్వులతో ఆగస్టు 20 వరకు గడువును పొడిగించారు. బీఎఫ్ఎస్సీ కోర్సుకు జులై 31న నోటిఫికేషన్ విడుదల అయింది. అప్పుడు దరఖాస్తు దాఖలకు ఆగస్టు 7 ఆఖరు తేదీగా నిర్ణయించారు. అపరాధ రుసుముతో ఆగస్టు 9 వరకు దరఖాస్తులు దాఖలు చేయొచ్చు. అయితే తాజాగా దరఖాస్తు దాఖలకు గడువును ఆగస్టు 20 వరకు పొడిగించారు.
రిజిస్ట్రేషన్ ఫీజు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ కేటగిరీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.1,000 ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగు అభ్యర్థులకు రూ.500 ఉంటుంది. గడువు ముగిసిన తరువాత రెండు రోజుల పాటు అపరాధ రుసుము రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ కేటగిరీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.2,000 ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000 ఉంటుంది.
అర్హత
ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అందులోనూ ఫిజికల్ సైన్స్, బయోలజికల్ లేదా నేచురల్ సైన్స్ ఉండాలి. అలాగే ఏపీ ఈఏపీసెట్-2024 ర్యాంకు సాధించి ఉండాలి. 2024 డిసెంబర్ 31 నాటికి వయస్సు 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. 2002 డిసెంబర్ 31 నుంచి 2007 డిసెంబర్ 31 మధ్య పుట్టిన వారై ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 25 ఏళ్లు, అంటే 1999 డిసెంబర్ 31 నుంచి 2007 డిసెంబర్ 31 మధ్య పుట్టిన వారై ఉండాలి. దివ్యాంగు అభ్యర్థులకు 27 ఏళ్ల వరకు అవకాశం ఉంది. అంటే 1997 డిసెంబర్ 3 1 నుంచి 2007 డిసెంబర్ 31 మధ్య పుట్టిన వారై ఉండాలి.
కాలేజీలు
బీఎఫ్ఎస్సీను రెండు కాలేజీలు అందిస్తున్నాయి. కాలేజ్ ఆఫ్ పిషరీ సైన్స్-ముత్తుకూరు (నెల్లూరు జిల్లా), కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా)ల్లో బీఎఫ్ఎస్సీ కోర్సు అందుబాటులో ఉంది. కాలేజ్ ఆఫ్ పిషరీ సైన్స్-ముత్తుకూరులో 40 సీట్లు, కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్-నరసాపురంలో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద పది శాతం సీట్లు ఉంటాయి. ముత్తుకూరు కాలేజీలో నాలుగు సీట్లు, నరసాపురం కాలేజీలో ఆరు సీట్లు మొత్తం పది సీట్లు ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు ఉంటాయి.
కోర్సు వ్యవధి
బీఎఫ్ఎస్సీ కోర్సు వ్యవధి నాలుగేళ్లు ఉంటుంది. మొత్తం ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ఇంగ్లీష్ మాధ్యమంలోనే బోధన ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://apfu-ugadmissions.aptonline.in/APFU/ పై క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తును దాఖలు చేయొచ్చు.
సీట్ల కేటాయింపు
ఏపీ ఈఏపీసెట్-2024 ర్యాంక్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. స్థానికత ఆధారంగా 85 శాతం సీట్లు ఉంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధి అభ్యర్థులకు 15 శాతం సీట్లు అన్ రిజర్వడ్ సీట్లు ఉంటాయి. అలాగే 42ః22 నిష్పతిలో ఆంధ్రాయూనివర్శిటీ, శ్రీ వెంకటేశ్వరయూనివర్సిటీ ప్రాంత అభ్యర్థులు స్థానికత ఆధారంగా కేటాయిస్తారు.
రైతు కోటా
25 శాతం రైతు (ఫార్మర్) కోటా సీట్లు గ్రామీణ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన అభ్యర్థులకు కేటాయిస్తారు. నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. అలాగే అభ్యర్థి తల్లిదండ్రులకు ఒక ఎకరా కంటే తక్కువ కాకుండా భూమి ఉండాలి.
రిజర్వేషన్లు
ఓపెన్ కేటగిరిలో 50 శాతం సీట్లు ఉన్నాయి. ఎస్‌సీ కేటగిరిలో 15 శాతం సీట్లు, ఎస్‌టీ కేటగిరిలో 6 శాతం సీట్లు ఉన్నాయి. బీసీ కేటగిరిలో 29 శాతం సీట్లు ఉన్నాయి. అందులో బీసీ-ఏ 7 శాతం, బీసీ-బీ 10 శాతం, బీసీ-సీ 1 శాతం, బీసీ-డీ 7 శాతం, బీసీ-ఈ 4 శాతం సీట్లు ఉన్నాయి. అలాగే వికలాంగు (పీహెచ్) కేటగిరిలో 5 శాతం సీట్లు ఉన్నాయి. సైనిక సిబ్బంది పిల్లల కేటగిరిలో 2 శాతం, ఎస్‌సీసీ కేటగిరిలో 1 శాతం, స్పోర్ట్స్ కేటగిరిలో 0.5 శాతం సీట్లు ఉన్నాయి. విద్యార్థినీలకు 33.33 శాతం రిజర్వేషన్ కేటాయించారు.
కోర్సు ఫీజులు
యూనివర్శిటీ ఫీజు (రిజిస్ట్రేషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, లైబ్రరీ ఫీజు, లేబొరటరీ ఫీజు, మెడికల్ ఫీజు, పరీక్ష ఫీజు) రూ.10,643, అలాగే ఒక సెమిస్టర్‌కు హాస్టర్ రూమ్ అద్దె రూ.1,474 ఉంటుంది. నాన్యూనివర్సిటీ ఫీజు రూ.8,305, హాస్టల్ డిపాజిట్ రూ.7,711, మెస్ డిపాజిట్ రూ.7,711 ఉంటుంది, మొత్తం ఫీజు రూ.35,844 ఉంటుంది.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్