Best Web Hosting Provider In India 2024
Vijay Sethupathi: తమిళ స్టార్ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇటీవలే మహారాజ చిత్రంతో భారీ బ్లాక్‍బస్టర్ కొట్టారు. సుమారు రూ.110కోట్ల కలెక్షన్లతో ఈ మూవీ సూపర్ అయింది. హీరోగా విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా కావడం మరింత ప్రత్యేకతగా ఉంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం సక్సెస్ అయింది. ఈ హిట్ జోష్‍లో ఉన్న విజయ్ సేతుపతి మరో కొత్త అవతారం ఎత్తనున్నారని తెలుస్తోంది. బిగ్‍బాస్ తమిళ్ 8వ సీజన్‍కు ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారనే సమాచారం బయటికి వచ్చింది.
కమల్ హాసన్ ప్లేస్‍లో..
బిగ్‍బాస్ తమిళ్ 7 సీజన్లకు దిగ్గజ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్ చేశారు. సక్సెస్‍ఫుల్‍గా ఈ షోను నడిపారు. తమిళ టీవీ ఇండస్ట్రీలో ఎక్కువ టీఆర్పీ సాధించిన షోల్లో బిగ్‍బాస్ కూడా నిలిచింది. అయితే, సినిమాల్లో బిజీగా ఉండాల్సి రావడంతో బిగ్‍బాస్ 8వ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు కమల్ హాసన్ ఇటీవలే ప్రకటించారు. బిగ్‍బాస్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నానని తెలిపారు. దీంతో ఆయన ప్లేస్‍లో ఎవరు వస్తారనే ఉత్కంఠ నెలకొంది.
కమల్ హాసన్ స్థానంలో బిగ్‍బాస్ తమిళ్ షోకు విజయ్ సేతుపతి హోస్ట్ చేయనున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఇప్పటికే ప్రోమో షూటింగ్ జరిగిందని, త్వరలోనే ఈ విషయంపై స్టార్ విజయ్ టీవీ ఛానెల్ నుంచి ప్రకటన వస్తుందంటూ సోషల్ మీడియాలో సమాచారం చక్కర్లు కొడుతోంది. ప్రోమోలో సేతుపతి ఉన్న స్కీన్‍షాట్లు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై త్వరలోనే అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో ప్రస్తుతం భారీ బడ్జెట్‍తో థగ్ లైఫ్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు కమల్ హాసన్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. నాయకన్ తర్వాత 36 ఏళ్ల అనంతరం కమల్ – మణిరత్నం కాంబినేషన్ మళ్లీ వస్తోంది. దీంతో థగ్‍లైఫ్ మూవీపై హైప్ విపరీతంగా ఉంది. భారతీయుడు 3, కల్కి సీక్వెల్ కూడా కమల్ లైనప్‍లో ఉన్నాయి. దీంతో బిగ్‍బాస్ తమిళ్ 8వ సీజన్‍ను హోస్ట్ చేయలేనంటూ కమల్ నిర్ణయించుకున్నారు. ఆ స్థానంలో విజయ్ సేతుపతి వస్తారంటూ ప్రస్తుతం రూమర్లు వస్తున్నాయి.
విజయ్ సేతుపతి లైనప్
నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన మహారాజ చిత్రం జూన్‍లో రిలీజై బిగ్ హిట్ అయింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ సూపర్ సక్సెస్ అయింది. భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. ఇక ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై పార్ట్-2లో విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవలే వచ్చిన సేతుపతి ఫస్ట్ లుక్ రస్టిక్‍గా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ఈ చిత్రానికి ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్‍మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. విజయ్ సేతుపతి చేసిన ‘గాంధీటాక్స్’ అనే ఓ సైలెంట్ మూవీ కూడా రావాల్సి ఉంది. ఈ మూవీలో అదితి రావ్ హైదరి, అరవింద్ స్వామి కూడా కీలకపాత్రల్లో నటించారు. కిశోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits