Best Web Hosting Provider In India 2024
తమిళనాడులో స్టూడెంట్ పట్ల ఓ టీచర్ ప్రవర్తనపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం ఆ ఉపాధ్యాయుడు తన స్టూడెంట్స్‌ని కాలితో కొడుతూ, తిడుతూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో కోచ్ ఆటగాళ్లను తన్నడం, చెంపదెబ్బ కొట్టడం వంటి దృశ్యాలు సర్వత్రా ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. కోచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
వీడియోలో, ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్లు మైదానంలో కూర్చునారు. వారిని ఇతర విద్యార్థులు చుట్టుముచ్చారు. ఇతంలో లైన్ చివర ఉన్న ఫిజికల్ ఎడ్జ్యుకేషన్ టీచర్.. తన స్టూడెంట్స్‌తో మాట్లాడుతూ, కొట్టడం మొదలుపెట్టాడు. విద్యార్థిని చెంపదెబ్బ కొట్టాడు, కాలితో తన్నాడు. టీచర్ దాడి నుంచి తమను తాము కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న కొందరు ఆటగాళ్ల జుట్టు పట్టుకుని లాగాడు. ఆటగాళ్ల చుట్టూ ఉన్న వారు జోక్యం చేసుకోకుండా ఆ సన్నివేశాన్ని చూస్తూ ఉండిపోయారు. వీడియోలు తీశారు!
తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరు సమీపంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన విద్యార్థులపై దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిని అన్నామలైగా గుర్తించారు.
“నువ్వు అబ్బాయివా లేక అమ్మాయివా? అతడిని ఎలా గోల్ కొట్టనిచ్చావు?’ అని గోల్ కీపర్‌ని ప్రశ్నించాడు. బంతిని ఎలా దాటనిచ్చారని మరొకరిని అడుగుతాడు. ‘మీరు ఒత్తిడిలో ఆడలేరా’ అని ప్రశ్నించాడు. మరో విద్యార్థినిపై దాడి చేసినప్పుడు కమ్యూనికేషన్ ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోని ఇక్కడ చూడండి..
సోషల్ మీడియా ఎలా స్పందించింది?
ఈ వీడియో ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేశారు. “జైలులో ఉండాలి” అని ఒక ఎక్స్ యూజర్ రాశారు. మరొకరు “దురదృష్టవశాత్తూ, ఇది ఒంటరి సంఘటన కాదు బ్రో! ఓటములు, పేలవమైన ప్రదర్శనల తర్వాత కోచ్‌లు తమ ఆటగాళ్లను విమర్శించడం నేను ఇప్పటికీ చూస్తున్నాను. ఆ రోజుల్లో నేను నా పాఠశాల జట్టుకు ఆడినప్పుడు కూడా, నా కోచ్ ఒక టోర్నమెంట్ ఓడిపోయిన తర్వాత మా ప్రతి ఒక్కరినీ అవమానించేవాడు. ఇప్పటికీ చూస్తుంటే బాధగా ఉంది,” అని ఇంకొకరు తన పర్సనల్ అనుభవాన్ని పంచుకున్నారు.
“ఆయనెవరు? ముందు అతడిని కోచ్‌గా నిషేధించాలి,” అని మరొకరు అభిప్రాయపడ్డారు. “సీరియస్లీ అతను కోచ్ ఆ?” అని ఇంకొకరు అసహనం వ్యక్తం చేశారు.
“ఓడిపోయిన తర్వాత ఇలా కొడితే, పిల్లల మానసిక స్థితి దెబ్బతింటుంది. జీవితంలో ఓటమి అంటే భయపడిపోతారు. రేపొద్దున్న పెద్ద పెద్ద విషయాల్లో ఓటమి వస్తే తట్టుకోలేరు! జీవితంలో గెలుపోటములు తప్పవని చెప్పాల్సిన టీచర్.. ఇలా చేయడం బాధాకరం. అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి,” అని మరొకరు రాసుకొచ్చారు.
ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి స్పందించారు. సదరు టీచర్ని సస్పెండ్ చేశామని, ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని మీడియాకు తెలిపారు.
ఈ ఘటనపై మీ స్పందన ఏంటి?
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link