Kolkata doctor rape case : దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్​.. ఐఎంఏ సంచలన ప్రకటన!

Best Web Hosting Provider In India 2024


కోల్​కతా వైద్యురాలి అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ (ఐఎంఏ) సంచలన ప్రకటన చేసింది. కోల్​కతా వైద్యురాలి మృతికి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్ట్​ 17 నుంచి 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది.

ఆగస్టు 9న కోల్​కతా ఆర్​జీ కర్ మెడికల్ కాలేజీలో డ్యూటీ డాక్టర్​ అత్యాచారం, హత్య ఈ నిర్ణయానికి కారణమని పేర్కొంది. ఆమె ఛాతీ వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్.

“ఇది వైద్య వర్గాలతో పాటు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటి నుంచి రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరుగుతున్నాయి,” అని ప్రకటనలో ఉంది.

24 గంటల పాటు సేవలు నిలిపివేత..

ఆగస్టు 17 (శనివారం) ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 18 (ఆదివారం) ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు మోడ్రన్ మెడిసిన్ వైద్యుల సేవలను నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

అయితే నిత్యావసర సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయని, క్షతగాత్రులకు చికిత్స జరుగుతుందని, కానీ సాధారణ ఓపీడీలు పనిచేయవని, ఎలక్టివ్ సర్జరీలు నిర్వహించబోమని ఐఎంఏ తెలిపింది.

మోడర్న్​ మెడిసిన్​ డాక్టర్లు సేవలందించే అన్ని రంగాల్లో సేవలను నిలిపివేస్తామని, వైద్యుల న్యాయమైన కారణంతో చేస్తున్న నిరసనలకు దేశ ప్రజల సానుభూతి అవసరమని ఐఎంఏ తెలిపింది.

కోల్​కతా వైద్యురాలి అత్యాచారం..

కోల్​కతాలో వైద్యురాలి రేప్​, దారుణ హత్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ కేసు విషయంపై కళాశాల అధికారుల నిర్లక్ష్యం, మొదటి రోజు తరువాత పోలీసు దర్యాప్తులు నిలిచిపోవడం వంటివి నిరసనలకు కారణాలుగా మారాయి. . 2024 ఆగస్టు 13న కోల్​కతా హైకోర్టు ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కు అప్పగించింది. రాష్ట్ర పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తే సాక్ష్యాలు నాశనం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమైంది.. ఆగస్టు 15, 2024 న, ఆసుపత్రిని పెద్ద గుంపు ధ్వంసం చేసింది, ఇది బాధితురాలు కనిపించిన ప్రాంతంతో సహా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను నాశనం చేసింది. నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులపై కూడా దాడి జరిగింది.

డాక్టర్లు, మరీ ముఖ్యంగా మహిళా వైద్యులు.. వృత్త స్వభావం కారణంగా హింసకు గురవుతున్నారు. ఆసుపత్రులు, క్యాంపస్​లలో వైద్యులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. భౌతిక దాడులు, నేరాలు రెండూ వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల అవసరాల పట్ల సంబంధిత అధికారుల ఉదాసీనత, నిర్లక్షాన్ని సూచిస్తున్నాయి.

దోషులను ఉరి తీయాల్సిందే.. కానీ’

కోల్​కతాలోని ఆర్​జీ కర్ ఆస్పత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, దోషులను ఉరితీస్తేనే అలాంటి ఆలోచనలు ఉన్న ప్రజలు గుణపాఠం నేర్చుకుంటారని మమతా బెనర్జీ అన్నారు. తనతో పాటు బెంగాల్ ప్రజలంతా బాధిత డాక్టర్ కుటుంబానికి అండగా ఉందని సీఎం మమత అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link