70th National Awards: రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు.. ఉత్తమ సినిమాగా మలయాళ మూవీ.. కార్తికేయ 2కు జాతీయ అవార్డు

Best Web Hosting Provider In India 2024


కన్నడ నటుడు రిషభ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2022 సినిమాలకు సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డులను సమాచార, ప్రసార శాఖ నేడు (ఆగస్టు 16) ప్రకటించింది. కాంతార సినిమాకు గాను రిషభ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. గతేడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍కు ఈ పురస్కారం దక్కగా.. ఇప్పుడు మరోసారి దక్షిణాది నటుడికే ఈ అవార్డు కైవసం అయింది. ఉత్తమ చిత్రంగా మలయాళ మూవీ ‘ఆట్టం’ నేషనల్ అవార్డు దక్కించుకుంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’ సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంది.

జాతీయ అవార్డుల పూర్తి లిస్ట్ ఈ వార్తలో కాసేపట్లో అప్‍డేట్ అవుతుంది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024