Visakha MLC Election 2024 : సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్న వైసీపీ – ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక!

Best Web Hosting Provider In India 2024


Visakha Mlc Election: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించటంతో పాటు నామినేషన్ వేసిన మరో అభ్యర్థి కూడా విత్ డ్రా అయ్యారు. ఫలితంగా బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనమైంది. బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.

జాయింట్‌ కలెక్టర్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు బొత్స సత్యనారాయణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. మూడేళ్లపాటు బొత్స ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా చేసి జనసేనలో చేరడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. 

విశాఖ‌ప‌ట్నం స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 814 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి 615, టీడీపీకి 215 మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్య బ‌లాన్ని ప‌రిశీలిస్తే వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమి ఈ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బొత్స ఎన్నికకు లైన్ క్లియర్ అయిపోయింది.

టాపిక్

YsrcpVisakhapatnam

Source / Credits

Best Web Hosting Provider In India 2024