విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక

Best Web Hosting Provider In India 2024

విశాఖపట్నం : స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేత, ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ  మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

బొత్స ఎన్నిక ప్రకటన తర్వాత విశాఖ కలెక్టరేట్‌ వద్ద సందడి వాతావరణం నెలకొంది.  జాయింట్‌ కలెక్టర్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్‌ తీసుకున్న అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. బీ ఫారం ఇచ్చి పోటీకి ప్రొత్సహించిన పార్టీ అధ్యక్షులు వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డికి, సహకరించిన జిల్లా నేతలకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేరు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

ఫలించని కూటమి ఎత్తులు
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కావాల్సిన పూర్తి బలం వైయ‌స్ఆర్‌సీపీ కి ఉంది. అయినప్పటికీ పోటీకి దించాలని కూటమి ప్రభుత్వం తొలుత భావించింది. కుయుక్తులు, కుట్రలకు తెర లేపింది. కానీ, పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్రమత్త చేయడంతో..వైయ‌స్ఆర్‌సీపీ కేడర్‌ ఏకతాటిపై నిల్చుంది. దీంతో టీడీపీ-కూటమి పాచికలు పారలేదు. లాభం లేదనుకుని అభ్యర్థిని నిలిపే ఆలోచనను విరమించుకుంది. మరోవైపు.. స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది. 

Best Web Hosting Provider In India 2024