Best Web Hosting Provider In India 2024
ఓటీటీల్లోకి ప్రతీ వారం సినిమాలు, వెబ్ సిరీస్‍లు క్యూకడుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే వారం (ఆగస్టు నాలుగో వారం) పుష్కలంగా వివిధ ఓటీటీల్లోకి నయా కంటెంట్ వచ్చేయనుంది. ఇందులో మూడు సినిమా ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తున్నాయి. ధనుష్ స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన రాయన్ సినిమా సహా ఓ మలయాళ మూవీ కూడా వచ్చే వారమే రానుంది. ఓ హిందీ మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. కల్కి 2899 ఏడీ చిత్రం కూడా ఓటీటీలోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఇంకా ఈ మూవీపై అధికారిక ప్రకటన రాలేదు. వచ్చే వారం ఓటీటీల్లోకి రానున్న ముఖ్యమైన సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.
రాయన్
తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటించిన రాయన్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో వచ్చే వారం ఆగస్టు 23వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. రాయన్ చిత్రం జూలై 26న థియేటర్లలో రిలీజై భారీ బ్లాక్‍బస్టర్ అయింది. సుమారు రూ.175కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి హీరో ధనుషే దర్శకత్వం కూడా వహించారు. తమిళంతో పాటు తెలుగులో థియేటర్లలో రాయన్ రిలీజ్ అయింది. ఆగస్టు 23న ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది.
గర్ర్
మలయాళ సర్వైవల్ కామెడీ సినిమా గర్ర్.. ఆగస్టు 20వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ సర్వైవల్ కామెడీ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. సూరజ్ వెంజరమూడు, కుంచాకో బోబన్ ఈ మూవీలో లీడ్ రోల్స్ చేయగా.. జై కే దర్శకత్వం వహించారు. జూన్ 14న థియేటర్లలో రిలీజైన గర్ర్ మూవీ మోస్తరుగా కలెక్షన్లను దక్కించుకుంది. ఈ కామెడీ మూవీని ఆగస్టు 20 నుంచి డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో చూడొచ్చు.
తిక్‍డమ్
తిక్‍డమ్ అనే హిందీ సినిమా నేరుగా జియో సినిమా ఓటీటీలో ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆగస్టు 23న ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఇటీవలే టీజర్ తీసుకొచ్చి స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించింది జియోసినిమా. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రంలో అమిత్ సియాల్, దివ్యాంశ్ ద్వివేది, భాను, ఆరోషి సౌద్ ప్రధాన పాత్రలు పోషించారు. వివేక్ అర్చాలియా దర్శకత్వం వహించారు. ఉపాధి కోసం పిల్లలతో నగరానికి వచ్చి తిప్పలు పడే ఓ తండ్రి చుట్టూ తిక్‍డమ్ చిత్రం సాగుతుంది. జియో సినిమాలో ఆగస్టు 23న ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుంది.
కల్కి 2898 ఏడీ వస్తుందా?
భారీ బ్లాక్‍బస్టర్ కల్కి 2898 ఏడీ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ రూ.1100 కోట్ల కలెక్షన్లను కూడా దాటేసింది. జూన్ 27న ఈ మూవీ రిలీజ్ కాగా.. 50 రోజులు పూర్తయినా ఇంకా థియేట్రిల్ రన్ కొనసాగుతోంది. కల్కి మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకుంది. హిందీ హక్కులు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ దగ్గర ఉన్నాయి. ఆగస్టు 23వ తేదీన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీల్లోకి వస్తుందంటూ రూమర్లు బలంగా వస్తున్నాయి. అయితే, స్ట్రీమింగ్ డేట్‍పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరి, ఆగస్టు 23న ఓటీటీలోకి కల్కి 2898 ఏడీ మూవీ వస్తుందా.. లేకపోతే ఇంకా ఆలస్యమవుతుందా అనేది చూడాలి.
Best Web Hosting Provider In India 2024
Source / Credits