Best Web Hosting Provider In India 2024
Brahmamudi August 17th Episode: ఉద్యోగం కోసం వెతుకుతున్న కళ్యాణ్‌కు ఓ చోట తన కవిత్వం ప్రింట్ అయిన బుక్ కనిపిస్తుంది. ఇంట్లో ఎవరికి తెలియకుండా వదిన కావ్య ప్రింట్ చేయించిన తన తొలి కవిత ఉన్న బుక్ చూసి కళ్యాణ్ ఆనందపడతాడు. ఉద్యోగం కోసంఎటు వెళ్లాలి, ఎవరిని అడగాలో తెలియకుండా తిరుగుతోన్న తనకు ఈ బుక్ మార్గదర్శకంగా నిలిస్తుందని భావించి కొనాలని అనుకుంటాడు కళ్యాణ్.
కానీ బుక్ కొనడానికి అవసరమైన ఇరవై రూపాయలు కూడా అతడి దగ్గర ఉండవు. బుక్‌లో కళ్యాణ్ ఫొటో చూసిన బుక్స్ అమ్మే అతడు డబ్బులు లేకుండానే బుక్ ఇస్తాడు. మళ్లీ ఇటువైపు వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వమని అంటాడు. కళ్యాణ్ కవితలపై అతడు ప్రశంసలు కురిపిస్తాడు. నీ రచనలతో గొప్ప స్థాయికి చేరుకుంటావని చెబుతాడు. అతడి మాటలతో కళ్యాణ్ పొంగిపోతాడు.
రాజ్‌ను అడ్డుకున్న ధాన్యలక్ష్మి…
కళ్యాణ్ ఆఫీస్‌కు బయలుదేరుతాడు. అతడిని ధాన్యలక్ష్మి అడ్డుకుంటుంది. ఎక్కడికి అంటూ రుద్రాణి కూడా ఏదో ఫిట్టింగ్ పెట్టబోతున్నట్లు హింట్ ఇస్తుంది. నీకు ఇప్పుడు పోటీ అన్నదే లేదుగా…నువ్వు వెళ్లి ఆ రాజ్యాన్ని రాకుమారుడిలా పరిపాలించు అంటూ రాజ్‌తో వెటకారంగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. ఎంటా వెటకారం అని ధాన్యలక్ష్మిని మందలిస్తుంది ఇందిరాదేవి.
ధాన్యలక్ష్మిని బయటకు తీసుకెళ్లి బ్రెయిన్‌వాష్ చేసినట్లుంది మా అత్త. మీ కుటుంబ విషయాల్లో ఈ కరివేపాకును ఎందుకు వెంటతిప్పుకుంటున్నారంటూ అత్తను ఆటాడుకుంటుంది రుద్రాణి. రాజ్‌కే పట్టం కట్టామని, రాజ్యాన్ని పాలించేది తన కొడుకునేనని అపర్ణ అంటుంది. …మధ్యలో నీకు..నీ చెంచాకు ఏంటి అభ్యంతరం అని రుద్రాణిని నిలదీస్తుంది.
కళ్యాణ్ కష్టాలు పడుతుంటే?
తన కొడుకు తినడానికి తిండి లేక, ఉండటానికి నీడలేక రోడ్లు పట్టుకు తిరుగుతున్నాడని ధాన్యలక్ష్మి గొడవ చేస్తుంది. తన కొడుకు కష్టాలు పడుతుంటే రాజ్ మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నాడని, ఒకే ఇంటి వారసుల్లో ఎందుకు ఇంత భేదం అని రచ్చ రచ్చ చేస్తుంది. కళ్యాణ్ ఇంటికొస్తానంటే ఎవరూ రావొద్దని అన్నారు… రాజ్ రమ్మని పిలిస్తే ఇంటికి రానని చెప్పింది నీ కొడుకు కాదా అంటూ ధాన్యలక్ష్మికి ధీటుగా సమాధానమిస్తుంది అపర్ణ.
కోడళ్లపై వివక్ష…
నీకు ఈ మందర ఏ విషం పెట్టింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని భార్యపై ప్రకాశం సెటైర్లు వేస్తాడు. భర్తనే తప్పు పడుతుంది ధాన్యలక్ష్మి. మీ మతిమరుపుతో అన్నయ్యపై ఆధారపడుతూ మా బతుకులు ఇలా చేశారంటూ ఎగతాళిగా మాట్లాడుతుంది.
ఇంట్లో కోడళ్లను సమానంగా చూడటం లేదని, అపర్ణను ఒకలా తననుమరోలా చూస్తున్నారంటూ వాదిస్తుంది. మధ్యలో కావ్యను లాగుతుంది. అపర్ణ, రాజ్‌ను కావ్య తన బుట్టలో వేసుకుందని, ఆస్తి మొత్తం రాజ్‌కు దక్కాలనే కళ్యాణ్ ఇంట్లో వెళ్లిపోతున్న ఆపలేదని ధాన్యలక్ష్మి అంటుంది.
స్వప్న వెటకారం…
మధ్యలో నేనేం చేశానని ధాన్యలక్ష్మికి కావ్య బదులిస్తుంది. ధాన్యలక్ష్మికి ఏదో కొత్త వైరస్ వచ్చినట్లుందని, ఇంట్లో అందరికి ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉందని ఆమె వాదనపై స్వప్న వెటకారంగా మాట్లాడుతుంది. నీ కొడుకును ఇంటికి తీసుకురావొద్దని ఎవరూ ఆపడం లేదని, కళ్యాణ్ నీ మాట వింటే అతడిని తీసుకొచ్చి ఆఫీస్‌కు పంపించమని ధాన్యలక్ష్మిని అపర్ణ నిలదీస్తుంది.
అంతే కానీ సంతోషంగా ఆఫీస్‌కు వెళుతోన్న నా కొడుకుకు ఎదురుగా ఈ దరిద్ర దేవతను ఎందుకు తీసుకొచ్చావని రుద్రాణిని చూపిస్తూ అపర్ణ అంటుంది. తనను అపర్ణ దరిద్ర దేవత అనడంతో రుద్రాణి తట్టుకోలేకపోతుంది. దేవత అన్నదని పొగడ్త అనుకునేరు అది తిట్టే అని స్వప్నఅత్తపై పంచ్ వేస్తుంది.
ఆస్తి ముక్కలు చేయాలి…
నా కొడుకుకు న్యాయం జరగాలంటే ఇప్పుడే ఆస్తిని ముక్కలు చేయాలని ధాన్యలక్ష్మి అంటుంది. మీ ఆస్తి మీరు తీసుకొని మా వాటా మాకు ఇచ్చేయండి అపర్ణ, సుభాష్‌లతో ధాన్యలక్ష్మి చెబుతుంది. నాకు వచ్చిన ఆస్తిని కళ్యాణ్‌కు ఇస్తానని అంటుంది. ఇది తరతరాలుగా వస్తోన్న ఉమ్మడి ఆస్తిని అని, అది అమ్మడం, పంచుకోవడం ఎప్పటికీ జరగదని ధాన్యలక్ష్మికి ఇందిరాదేవి క్లాస్ ఇస్తుంది.
చేయి ఎత్తిన ప్రకాశం…
నీ వల్లే కళ్యాణ్ రోడ్డున పడ్డాడని, అతడి కాపురం ముక్కలైందని..ఇప్పుడు ఆస్తుల పంపకాల గురించి మాట్లాడుతున్నావా అంటూ ధాన్యలక్ష్మి చెంప పగలగొట్టడానికి ప్రకాశం చేయి ఎత్తుతాడు. కానీ అతడిని సుభాష్ ఆపుతాడు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని ధాన్యలక్ష్మి అంటుంది. నీలాగే నా కొడుకు అన్నయ్యదయాదక్షిణ్యాలపై బతకాల్సిన ఖర్మ పట్టలేదని భర్తను లెక్కపెట్టకుండా గొడవ పెద్దది చేస్తుంది.
ఆస్తిని కరిగిస్తారో..ఉంచుతారో…
కళ్యాణ్ తిరిగి ఇంటికి వచ్చేలోపు ఈ ఆస్తిని ఉంచుతారో, కరిగిస్తారో లేదంటే పుట్టింటికి ధారపోస్తారో అని రాజ్, కావ్యలను చూపిస్తూ అంటుంది ధాన్యలక్ష్మి. నన్ను కొడుకులా పెంచిన మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని, కళ్యాణ్‌కు నేను ఎప్పటికీ అన్యాయం చేయనని ధాన్యలక్ష్మికి మాటిస్తాడు రాజ్.
ఆస్తుల పంచుకొంండి…మొత్తం తీసుకొండి అంతే కానీ నా భర్తను అనుమానిస్తే..అతడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తే ఊరుకునేది లేదని ధాన్యలక్ష్మి కి కావ్య వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఈ ఇంటి మనిషికి కాదని, బయటి నుంచి వచ్చావు…బయటిదానిలాగే ఉండు అని కోపంగా కావ్యతో అంటుంది ధాన్యలక్ష్మి. మీరు ఈ ఇంటికి బయటినుంచే వచ్చారు. బయటిదానిలానే మాట్లాడండి అంటూ ధాన్యలక్ష్మి తగ్గ సమాధానం ఇస్తుంది స్వప్న.
ఆస్తి నాది…వాటాలు కుదరవు…
అప్పటివరకు మౌనంగా ఉన్న సీతారామయ్య ఈ ఆస్తి తనది అని అసలు నిజం బయటపెడతాడు. నా తర్వాతి తరం కూడా ఉమ్మడిగా ఆస్తిని అనుభవించుకోవాలి తప్ప…వాటాలు పంచుకోవడం కుదరదని సీతారామయ్య అంటాడు. కళ్యాణ్ మీ మనవడే కదా…వాడికి ఆస్తిని అనుభవించే హక్కు లేదా ధాన్యలక్ష్మి అడుగుతుంది. కళ్యాణ్‌కు ఆస్తిపై హక్కు లేదని ఎవరైనా ఇంట్లో అన్నారా ధాన్యలక్ష్మిని ప్రశ్నిస్తాడు సీతారామయ్య. ఎవరు అనకుండానే ధాన్యలక్ష్మి ఏదేదో ఊహించుకొని ఇలా మాట్లాడుతుందని ఇందిరాదేవి బదులిస్తుంది.
ధాన్యలక్ష్మి నిందలు…
ధాన్యలక్ష్మి అనామికకు అమ్మమ్మలా మారిపోయిందని, ఆస్తి మొత్తాన్ని నా కొడుకు, కోడలు దోచుకుంటున్నారని నిందలు వేసిన తర్వాత కూడా ఈ విషయాన్ని ఇంతటిలో వదిలేయడం కరెక్ట్ కాదని అపర్ణ అంటుంది. ఈ గొడవను సీతారామయ్యే తేల్చాలని చెబుతుంది.
సీతారామయ్య తీర్పు…
కళ్యాణ్ ఇంటికి తిరిగివచ్చే వరకు రాజ్ ఆఫీస్ బాధ్యతలకు దూరంగా ఉండాలని సీతారామయ్య తీర్పు ఇస్తాడు. అతడి తీర్పు విని రాజ్ షాకవుతాడు. ఎవరు చూసుకోకపోతే బిజినెస్ మొత్తం దివాలా తీస్తుందని అపర్ణ సర్ధిచెప్పబోతుంది. ఈ సమస్యను పుట్టించిన వాళ్లే ఇంతకింత అనుభవించకతప్పదని సీతారామయ్య అంటాడు.
కావ్య అభ్యంతరం…
తన తీర్పులో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అందరిని సీతారామయ్య అడుగుతాడు. తనకు అభ్యంతరం ఉందని కావ్య అంటుంది. సమస్యను తీర్చడం కోసం రాజ్‌ను ఆఫీస్‌కు వెళ్లొద్దని అంటే కంపెనీ విలువలు పడిపోతాయి. తరతరాలుగా మీరు సంపాదించుకున్న పేరుప్రతిష్టలు దెబ్బతింటాయని సీతారామయ్యతో అంటుంది కావ్య.
తాతయ్యకు ఎదురుచెబుతావా కావ్యపై రాజ్ కోప్పడుతాడు. ధాన్యలక్ష్మి అహం చల్లర్చడం కోసం మీరు ఆధిపత్యం వదులుకుంటే మనకే ఎంతో నష్టం వాటిల్లుతుందని, ప్రత్యర్థులకు మనమే కోరి అవకాశం ఇచ్చినట్లవుతుందని కావ్య అంటుంది. ఆ తర్వాత ఇదే విషయమై భర్త రాజ్‌తో కావ్య వాదిస్తుంది.
కళ్యాణ్ వచ్చేలోపు కంపెనీ పరిస్థితి ఏమవుతుందోనని కంగారు పడుతుంది. నీకు ఈ మధ్య ఆస్తులు, ఐశ్వర్యాలపై మోజు పెరిగినట్లు ఉందని, అందుకే కళ్యాణ్ ఇంటికి రాకూడదని కోరుకుంటున్నావని కావ్యతో అంటాడు రాజ్. భర్త మాటలకు కావ్య షాకవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits