Best Web Hosting Provider In India 2024
Heavy Rain in Medak : తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఒక్క మెదక్ టౌన్ లోనే దాదాపు గంటన్నర పాటు ఎడతెరపి లేకుండా ఏకధాటిగా వాన పడింది.
భారీ వర్షం పడటంతో మెదక్ పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై పార్క్ చేసిన బైకులు కొట్టుకుపోయాయి. తమ వాహనాల కోసం వాహనాదారులు పరుగులు పెట్టే పరిస్థితులు కనిపించాయి. శుక్రవారం మెదక్‌లో అత్యధికంగా 12.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ వానాకాలం సీజన్ లో ఈస్థాయిలో వర్షం పడటం ఇదే తొలిసారి. గజ్వేల్, దుబ్బాక చేర్యాల, బెజ్జంకి, ములుగు, వర్గల్ మండలాల పరిధిలోనూ భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురవటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సాగుకు ఇబ్బందులు తప్పే అవకాశం ఉందని అంచనా వేసుకుంటున్నారు.
మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానూ శుక్రవారం రాత్రి భారీ వర్షం పడింది. చిగురుమామాడిలో 169.5 మిమీ వర్షపాతం నమోదైంది.కొడిమ్యాల మండల పరిధిలోని పుడూరులో 92 మిమిల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మల్లాపూర్, వీణవంక, గుండి, గంగాధర, నేరేళ్లు, ధర్మపురి, జగిత్యాలలోనూ భారీ వర్షం కురిసింది.
ఇక హైదరాబాద్ నగరంలోనూ శుక్రవారం వర్షం మరోసారి దంచికొట్టింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్ పూర్, ఖైరతాబాద్, చందానగర్, మియాపూర్, సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.భారీ వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
4 రోజులపాటు భారీ వర్షాలు:
వాయువ్య బంగాళాఖాతం మీదుగా బంగ్లాదేశ్ కు అనుకొని ఉన్న ప్రాంతాల మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరిత అవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది. కొంకణ్ నుంచి ఆగ్నేయ ఆరేబియా సముద్రం ఉన్న ద్రోణి ఉందని వివరించింది. దక్షిణ, ఉత్తర అంతర్భాగ కర్నాటక పొరుగు ప్రాంతాల మీద ఉనఅన ఉపరిత ఆవర్తనం మీదుగా వ్యాపించి…. సముద్ర మట్టానికి 1. 5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు పేర్కొంది.
ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు నాలుగు రోజల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆగస్టు 21వ తేదీ వరకు వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 21వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ చూస్తే ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం మరియు శ్రీ సత్య సాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,బాపట్ల, ప్రకాశం,నెల్లూరు,వైయస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
టాపిక్