Best Web Hosting Provider In India 2024
ఇల్లు చూడ్డానికి ఎంత ఆహ్లాదంగా, అందంగా అలంకరించి ఉంటే మనసుకు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి అలంకరణలో వివిధ రకాల వస్తువులను ఉంచటం వల్ల అందంతో పాటూ అదృష్టం, పాజిటివిటీ పెరుగుతుంది. అందంతో పాటూ వాస్తు కళతో ముడిపడిన కొన్ని వస్తువులను ఇంట్లో సరిగ్గా అలంకరిస్తే ఇంట్లో ప్రతికూలత తగ్గుతుంది.
గోడ గడియారం:
గోడపై గడియారం చేసే టిక్ టిక్ చప్పుడు చాలా మందికి నచ్చదు. ఇంట్లో ఏ మూలనుంచి ఆ చప్పుడు వినిపించినా ఇబ్బందిగా ఫీలవుతారు. ఇక ఫోన్ల వల్ల గోడ గడియారాల వాడకం చాలా ఇళ్లలో దాదాపుగా తగ్గిపోయింది. కానీ సమయం ఎంత వేగంగా గడిచిపోతుందో తెలియజేసే గోడ గడియారం తప్పకుండా ఇంట్లో ఉంచుకోవాలి. ఇది మనకు సమయం విలువ గుర్తు చేయడంతో పాటే నెగటివిటీని తొలగించడంలో సాయపడుతుంది.
కుటుంబ సభ్యుల ఫొటో:
మీ కుటుంబం అంతా గుర్తుంచుకునే తీపి గుర్తుకు సంబంధించిన ఫొటో ఏదైనా ఉంటే లీవింగ్ రూంలో గోడకు తగిలించండి. ఈ అందమైన ఫొటో ఫ్రేమ్ ఇంటి అందాన్ని పెంచడమే కాక పాజిటివ్ ఎనర్జీనీ ఇస్తుంది. మీ బంధాల్ని గుర్తు చేస్తుంది.
అద్దం:
చిన్న ఇల్లు కూడా పెద్దదిగా కనిపించడానికి అద్దం చాలా సహాయపడుతుంది. అద్దాలు పొదిగిన హ్యాంగింగ్ మిర్రర్ బాల్, మెరిసిపోయే షాండిలియర్, పెద్ద అద్దంతో ఇంటిని అలంకరించండి. ఇవన్నీ అందం పెంచడంతో పాటూ ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతాయి.
మట్టి విగ్రహాలు:
మట్టితో చేసిన విగ్రహాలను ఇంటికి ఈశాన్య మూలలో లేదా దక్షిణ దిశలో ఉండేలా చూసుకోండి. అందమైన మట్టి శిల్పాలు, కళాఖండాలు అనేక రకాల్లో మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని తెచ్చి ఇంటిని అలంకరించుకోండి. ఇవి ఇంటి విజయాన్ని తెచ్చిపెట్టడానికి సాయపడతాయి.
లైటింగ్:
ఇంట్లోని ప్రతి మూలలో సహజసిద్ధమైన వెలుతురు ఉండటం మంచిది. దీంతో ఇల్లు పెద్దదిగా, అందంగా కనిపిస్తుంది. కానీ సహజమైన కాంతి ప్రతి మూలకు చేరకపోతే, డిజైనర్ లైట్లను వివిధ రంగుల్లో, షేడ్లలో అమర్చండి. దీంతో ఇల్లు పెద్దగా, మంచి లుక్‌లో కనిపిస్తుంది. వెలుతురు లేని ఇల్లుకు కళ ఉండదు. చీకటిని తరిమేసే కాంతి ఇళ్లంతా ఉంటే శుభమే కదా. దీని ప్రభావం మెదడుపై తప్పకుండా ఉంటుంది.
టాపిక్