Warangal: కరెంట్ పోయిందని ఫోన్ చేస్తే బూతులు తిట్టారు.. సస్పెండ్ అయ్యారు!

Best Web Hosting Provider In India 2024


కరెంట్ పోయిందని ఫోన్ చేస్తే.. మద్యం మత్తులో బూతులు తిట్టిన విద్యుత్ ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వరంగల్ జిల్లాలో విధి నిర్వహణలో అసభ్యకరంగా వ్యవహారించిన ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. వరంగల్ సర్కిల్ పరిధిలోని ఏ.ఈ డిస్ట్రిబ్యూషన్ ఏ.జె మిల్స్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న యం.జ్యోతిర్మయినాథ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తరువులు జారీ చేశారు. అలాగే గొర్రెకుంట సబ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డి. నరేష్‌ను కూడా సస్పెండ్ చేస్తూ.. వరంగల్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పీ.మధుసూదన్ రావు ఆదేశాలు జారీ చేశారు.

బూతులతో రెచ్చిపోయారు..

స్వాతంత్య్ర దినోత్సవం రోజున విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో.. కాశీబుగ్గలోని వినియోగ దారుడు కరుణాకర్ రెడ్డి.. విద్యుత్తు అధికారులకు ఫోన్ చేశారు. ఓసిటీ రోడ్డులోని సబ్ స్టేషన్ పరిధిలో కరెంట్ రావడం లేదని చెప్పారు. అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యుత్ ఉద్యోగి బూతులతో రెచ్చిపోయాడు. ఆ ఉద్యోగి మాట్లాడిన ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు సదరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.

చర్యలు తప్పవు..

వినియోగదారులు ఫోన్ చేసినప్పుడు గానీ.. కార్యాలయాలకు వచ్చినప్పుడు గానీ.. ఎవరైనా అభ్యంగా మాట్లాడినా.. ప్రవర్తించినా చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలం కాబట్టి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయని.. అందరూ అలెర్ట్‌గా ఉండాలని పీ.మధుసూదన్ రావు స్పష్టం చేశారు.

టాపిక్

ElectricityWarangalEmployees

Source / Credits

Best Web Hosting Provider In India 2024